ఆళ్ల రామకృష్ణా రెడ్డిపై ఛీటింగ్ కేసు... పోలీసులకు టిడిపి నేతల ఫిర్యాదు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 4, 2020, 12:56 PM IST
Highlights

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై చీటింగ్ కేసు నమోదు చేయాలని రాజధాని రైతులు, టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

అమరావతి: రాజధాని అమరావతి విషయంలో నమ్మించి మోసం చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పై చీటింగ్ కేసు నమోదు చేయాలని రాజధాని రైతులు, టిడిపి నాయకులు మంగళగిరి పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై 420 కేసు పెట్టి విచారణ చేసి కోర్టులో కేసు ఫైల్ చేయవలసిందిగా పోలీసులకు విన్నపం చేసుకున్నామని తాడేపల్లి పట్టణ టిడిపి అధ్యక్షులు జంగాల సాంబశివరావు తెలిపారు. 

''2019 ఇది ఎన్నికలకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజక ప్రజలకు రాజధాని అమరావతిలో ఉంటుంది... రాజధాని మార్పు జరగదన్నారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పట్టణంలో నివాసం ఏర్పరుచుకున్నారు అని ప్రజలకు మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచారు. ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం చేపట్టిన రాజధాని మార్పు విషయంలో పూర్తిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సహకరించి రాజధాని మార్పు అంగీకరించారు'' అని అన్నారు. 

వీడియో

"

''ఎన్నికల ముందు రాజధాని మార్పు ఉండదని ఓట్లు వేయించుకొని గెలిచి ఎన్నికల తర్వాత రాజధానికి మార్పుకు మోసపూరితంగా అంగీకారం తెలిపి మంగళగిరి నియోజకవర్గ ప్రజలను, రైతులను రైతు కూలీలను మోసం చేశారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. కాబట్టి ఆయనపై 420 కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా తాడేపల్లి సిఐ కి విన్నపం చేసుకున్నాం'' అని సాంబశివరావు తెలిపారు. 

పోలీస్ స్టేషన్ వద్ద టిడిపి నాయకులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండాలతో పోలీస్ స్టేషన్ ముందు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం నాయకులు, రైతులు తమ నిరసన తెలిపారు. 
       

Last Updated Aug 4, 2020, 1:03 PM IST