Asianet News TeluguAsianet News Telugu

వేధింపులు...సాధింపులే... పాలనా అనభవం లేకే..: వైసిపిపై బోండా ఉమ ఫైర్

టిడిపి సీనియర్ నాయకులు బోండా ఉమ వైఎస్సార్‌సిపి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తాను వివిధ సామాజికివర్గాల అభివృద్ది కోసం ఏర్పాటుచేసిన కార్పోరేషన్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...దీనిపై పోరాటానికి సిద్దమవుతున్నట్లు ఉమ ప్రకటించారు.  

tdp leader  bonda uma fires on ysrcp  governmet
Author
Vijayawada, First Published Oct 17, 2019, 2:03 PM IST

విజయవాడ: గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలకు కలుపుకుపోయి ముందుకు సాగినట్లు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కానీ నేటి ప్రభుత్వం ఏ సామాజికవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కనీసం ఒక్క సామాజికవర్గ కార్పోరేషన్ కు  నిధులు అందించారా...? అని ఉమ ప్రశ్నించారు. 

గత టిడిపి ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేసిందని అన్నారు. కానీ వైసిపి ప్రభుత్వం నేటికి ఆ కార్పోరేషన్ కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. 

అలాగే  కాపు కార్పొరేషన్ కు రూ.2 వేల కోట్లు కేటాయించారు కానీ ఇప్పటిదాకా ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయలేదన్నారు. కొన్ని సామాజిక వర్గాల కార్పోరేషన్ లకు అయితే కనీసం నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. 

వితంతువులు, వృద్దులు, వికలాంగులకు పెన్షన్ రూపంలో అందించే ధన సాయాన్ని  పెంచుతానని ప్రకటించి కేవలం మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో  ఓట్ల కోసం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత  మోసం చేస్తున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మహిళలకు రుణాలు,స్కాలర్‌షిప్ లు,స్వయం ఉపాధి రుణాలు గతంలో ఇచ్చామని గుర్తుచేశారు. కానీ నేటి ప్రభుత్వ ఇప్పటివరకు నిధులు మంజూరు చేయకుండా ఆయా కార్పొరేషన్ లలో లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.  వైసిపికి పరిపాలన అనుభవం లేక పేద ప్రజలు,ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 

 ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం లేదని... దీంతో అగ్ర కుల పేదలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో చట్టబద్ధంగా సామాజిక వర్గాలకు కేటాయించిన సదుపాయాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వేధింపులు ,సాధింపుల  కోసమే పాలన సాగిస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తోందన్నారు. 

వివిధ సామాజిక కార్పొరేషన్ లకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీరి తరపునత్వరలో అన్నిసమాజికవర్గాలను ఏకం చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం

Follow Us:
Download App:
  • android
  • ios