Asianet News TeluguAsianet News Telugu

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట

స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు సాదారణ రోజులకన్నా అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. 
 
ttd officer gave special importance to normal people to visit lord venkateswara in tirumala
Author
Hyderabad, First Published Oct 7, 2019, 1:05 PM IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.02 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ తెలిపారు. 

రాంభగీచా 2లోని మీడియా సెంటర్‌లో సోమ‌వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ.300 దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. 

స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు సాదారణ రోజులకన్నా అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు. 

శ్రీవారి హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 17.97 కోట్లు లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా  8.5  లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు వివరించారు. శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకు 30.15 లక్షల లడ్డూలు అందించినట్లు తెలియజేశారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశామ‌న్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios