Asianet News TeluguAsianet News Telugu

దళారులు.. దందాలు.. అంబర్‌పేట,వరంగల్ ఎమ్మెల్యేల పేరుతో..

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది. అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డుకాలం మొదలైంది.

tirumala police busts racket that sold vip darshan tickets, creates hundreds of fake recommendation
Author
Tirumala, First Published Nov 1, 2019, 3:22 PM IST

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ సిఫారసు లేఖలు సృష్టించి దర్శనాలు చేయిస్తామని భక్తులను మభ్యపెడుతున్నారు. మూడు దర్శనాలు.. ఆరు డబ్బులు అన్నట్లుగా వీరి దందా సాగుతోంది.

అయితే టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడ్డుకాలం మొదలైంది. క్యూలైన్ల వద్ద అనుమానం కలిగిన టిక్కెట్లను తనిఖీలు చేయడం ప్రారంభించడంతో దళారుల బాగోతం బయటపడుతోంది.

Also Read:తిరుమలలోనే కాదు తిరుపతిలోనూ మద్య నిషేదం...: టిటిడి నిర్ణయం

గత రెండు నెలల కాలంలో మొత్తం 300 మంది దళారులను టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్న దళారి చారి వ్యవహారంలో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు చెందిన 46 మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫారసు లేఖలపై కొందరు దర్శనాలు పొందినట్లుగా అధికారులు గుర్తించారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫారసు లేఖపై 36 సార్లు టిక్కెట్లు పొందగా.. అంబర్‌పేట ఎమ్మెల్యే సిఫారసుపై 23, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు పొందారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ, ప్రస్తుత హోంమంత్రులను సైతం దళారులు వదిలిపెట్టలేదు. ఒక్క దళారే వందల సార్లు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై టిక్కెట్లు పొంది భక్తులకు విక్రయించాడు.

అలాగే ఇంటిదొంగ గుట్టును కూడా విజిలెన్స్ రట్టుచేసింది. టీటీడీలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ సులభ దర్శనాలు చేయిస్తానని భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. 

Also Read:వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి, న్యూఇయర్... దాతలకు షాకిచ్చిన టిటిడి

బుధవారం జరిగిన టిటిడి బోర్డు సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఆద్యాత్మికతను కాపాడటానికి పలు సంస్కరణలు చేపట్టాలంటూ ప్రభుత్వానికి కొన్ని సిపార్పులు చేయాలని టిటిడి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. 

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ధార్మిక క్షేత్ర‌మైన తిరుమ‌లకు ఎంతో భ‌క్తిభావంతో భ‌క్తులు వ‌స్తున్నార‌ని... ఇంతటి పవిత్ర ప్రాంతంలో మధ్యపానానికి చ్ోటులేకుండా గతంలోనే చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ ఆధ్యాత్మిక‌భావ‌న మ‌రింత పెంచేలా తిరుమ‌ల త‌ర‌హాలో తిరుప‌తిలోనూ ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పాన నిషేధం అమ‌లుచేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించింది. 

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం బుధ‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం టిటిడి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి పిలుపుమేర‌కు తిరుమ‌ల‌లో కూడా సంక్రాంతి తర్వాత  ప్లాస్టిక్ వాడ‌కాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.  స్వామివారి ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్ క‌వ‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయ చ‌ర్య‌లు చేప‌డ‌తామని తెలిపారు. 

తిరుప‌తి న‌గ‌రవాసుల‌తోపాటు బ‌య‌ట ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా గ‌రుడ వార‌ధిని రీడిజైన్ చేసి రీటెండ‌ర్లు పిలిచేందుకు నిర్ణ‌యం  తీసుకున్నట్లు  తెలిపారు. తిరుప‌తి న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు న‌గ‌ర శివార్ల నుండే ఈ వార‌ధి ప్రారంభ‌మ‌య్యేలా డిజైన్‌లో మార్పు చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios