Asianet News TeluguAsianet News Telugu

తిరుమల సమాచారం : విరాళాలిస్తే వీఐపి దర్శనభాగ్యం

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు తిరుమలకు వెళుతున్నారా....అయితే మీరు తప్పకుండా మేమందించే తిరుమల సమాచారాన్ని ఫాలో కావాల్సిందే. 

asianet news telugu special: today information of tirumala
Author
Tirumala, First Published Oct 22, 2019, 2:00 PM IST

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలనే భక్తుల సౌకర్యార్థం ఏషియానెట్ న్యూస్ ప్రత్యేకంగా తిరుమల సమాచారాన్ని అందిస్తోంది. తిరుమలలో వాతావరణ పరిస్థితులు, రద్దీ, సౌకర్యాలు తదితర  విషయాల గురించి తెలుసుకోవాలంటే తాము ప్రతిరోజు అందించే ఈ తిరుమల సమాచారాన్ని పాలోకండి.   ఈ రోజు మంగళవారం 22.10.2019  ఉదయం 5 గంటల వరకు గల పరిస్థితుల ఆధారంగా తిరుమలలో పరిస్థితులు ఇలా వున్నాయి. 
 
వాతావరణం: దాదాపుగా ఈ రోజంతా 19°C-23℃ ఉష్ణోగ్రత నమోదవనుంది.

నిన్న(సోమవారం)  66,025 మంది   భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామి వారిని  దర్శించుకున్నారు.

నిన్న 23,908 మంది    భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 4.42 కోట్లుగా వుంది.
 
ఉదయం వరకు స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లోని 2 గదుల్లో భక్తులు వేచి ఉన్నారు. 

శ్రీవారి సర్వదర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి
 దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతోంది.     

గమనిక:  రూ.10,000/- విరాళం  ఇచ్చు శ్రీవారి భక్తులకు టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విఐపి బ్రేక్ దర్శనభాగ్యాన్ని కల్పించింది. ఇక ఈనెల 30 న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం.(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు). ఈనెల 29న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం. వయోవృద్దులు, దివ్యాంగులు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios