Asianet News TeluguAsianet News Telugu

సైనా నెహ్వాల్, శ్రీకాంత్ లకు నిరాశ... తొలి రౌండ్ లోనే వెనక్కి

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌ టోర్నీలో బరిలోకి దిగని శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు.

Denmark Open: Kidambi Srikanth, Saina Nehwal Knocked Out After Losing In First Round
Author
Hyderabad, First Published Oct 17, 2019, 8:59 AM IST

భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ లకు మరోసారి నిరాశ ఎదురైంది. డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నమెంట్ లో తొలి రౌండ్ లోనే ఇంటికి వెనుదిరిగారు. ఇద్దరూ ఒకప్పుడు ఛాంపియన్స్ . కానీ... గత కొంతకాలంగా ఈ ఇద్దరూ ఏ మ్యాచ్ లోనూ సరిగా రాణించలేకపోతున్నారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 15–21, 21–23తో సయాక తకహాషి (జపాన్‌) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఏడాది తకహాషి చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మోకాలి గాయంతో చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌ టోర్నీలో బరిలోకి దిగని శ్రీకాంత్‌ డెన్మార్క్‌ ఓపెన్‌లో ఆకట్టుకోలేకపోయాడు. 

ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌ 14–21, 18–21తో నాలుగో సీడ్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి చవిచూశాడు. 2017 ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో ఆంటోన్సెన్‌పై ఇదే స్కోరుతో శ్రీకాంత్‌ గెలుపొందడం విశేషం.

గత రెండేళ్లలో ఆంటోన్సెన్‌ ఆటతీరులో ఎంతో పురోగతి కనిపించింది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్, బార్సిలోనా మాస్టర్స్, యూరోపియన్‌ గేమ్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన ఆంటోన్సెన్‌ ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత ప్లేయర్‌ సమీర్‌ వర్మ 21–11, 21–11తో సునెయామ (జపాన్‌)పై గెలిచాడు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) జంట 21–16, 21–11తో మారి్వన్‌ సీడెల్‌–లిండా ఎఫ్లెర్‌ (జర్మనీ) జోడీపై నెగ్గింది. రెండో సీడ్‌ వాంగ్‌ యి లియు–హువాంగ్‌ డాంగ్‌ పింగ్‌ (చైనా) జోడీకి సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జంట వాకోవర్‌ ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios