Asianet News TeluguAsianet News Telugu

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

కక్షను మనసులో పెట్టుకొని హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులపై అత్యాచారం చేసి శ్రీనివాస్ రెడ్డి హత్యకు పాల్పడ్డాడు. గతంలో తనకు జరిగిన పరాభవానికి ఈ హత్యల ద్వారా ప్రతీకారం తీర్చుకొన్నానని ఉన్మాదంతో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

why srinivas reddy killed girl students at hazipur village
Author
Bhuvanagiri, First Published May 1, 2019, 12:11 PM IST

భువనగిరి: కక్షను మనసులో పెట్టుకొని హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులపై అత్యాచారం చేసి శ్రీనివాస్ రెడ్డి హత్యకు పాల్పడ్డాడు. గతంలో తనకు జరిగిన పరాభవానికి ఈ హత్యల ద్వారా ప్రతీకారం తీర్చుకొన్నానని ఉన్మాదంతో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.

హాజీపూర్ గ్రామంలో ముగ్గురు విద్యార్థినులపై శ్రీనివాస్ రెడ్డి రేప్ చేసి దారుణంగా వారిని హత్య చేశాడు.  తనను అవమానించినందుకు గాను  శ్రీనివాస్ రెడ్డి కక్షగట్టారు. సమయం కోసం వేచి చూసి అదను దొరికిన వెంటనే కాటేశాడు.

హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డికి చిన్నతనం నుండి నేర ప్రవృత్తి ఉంది.  దొంగతనాలు చేయడం లాంటి కేసులు శ్రీనివాస్ రెడ్డిపై ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి గ్రామంలో ఎవరితో ఎక్కువగా కలిసేవాడుకాదని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు.

అంతేకాదు చిన్నతనం నుండి  నేర స్వభావం ఉన్న శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత  అదే పద్దతిని కొనసాగించారు. కొన్నేళ్ల క్రితం మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వివాహితను శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.

వరుసగా  ఆమెను మూడు దఫాలు ఆమెను వేధించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తమ కుటుంబసభ్యుల చెప్పింది. దీంతో ఆ వివాహిత కుటుంబసభ్యులు హాజీపూర్ గ్రామానికి వచ్చి శ్రీనివాస్ రెడ్డిని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ సమయంలో గ్రామస్తులు కూడ ఆ వివాహితకు అండగా నిలిచారు.

ఈ ఘటనను శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అవమానంగా భావించారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని మనసులో నిర్ణయం తీసుకొన్నాడు. అవకాశం ఎదురు చూస్తున్నాడు.  ఈ సమయంలోనే నాలుగేళ్ల క్రితం మైసిరెడ్డిపల్లికి చెందిన ఆరో తరగతి చదివే కల్పన అమ్మమ్మ ఇంటి నుండి తమ స్వగ్రామం మైసిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఆమె అదృశ్యమైంది. శ్రీనివాస్ రెడ్డి కల్పనపై అత్యాచారం చేసి హత్య చేశారు.

కల్పన డెడ్‌బాడీని గోనెసంచిలో మూటకట్టి వ్యవసాయబావిలో పూడ్చిపెట్టాడు.  ఈ ఘటన గురించి ఇంతవరకు బయటకు రాలేదు.  ఆ తర్వాత కర్నూల్‌లో పనిచేసే సమయంలో ఓ సెక్స్ వర్కర్‌ను  శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడు.  సెక్స్ వర్కర్‌ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ ట్యాంకులో పారేశారు.

నెల రోజుల క్రితం డిగ్రీ విద్యార్ధిని మనీషా‌కు లిఫ్ట్ ఇస్తామని  చెప్పి గ్రామానికి తీసుకొస్తూ ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు.  మనీషా డెడ్ బాడీని తన వ్యవసాయ బావిలో పూడ్చిపెట్టాడు.  మనీషాని చంపిన తర్వాత కూడ ఎవరూ పట్టించుకోకపోవడంతో శ్రావణిని హత్య చేశాడు. 

 శ్రావణి హత్య విషయమై గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో  పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.శ్రావణి హత్య కేసులో విచారణ సమయంలో  మిగిలిన హత్య కేసు విషయాలు కూడ వెలుగు చూశాయి.

సంబంధిత వార్తలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

శ్రావణి హత్య కేసు: నిందితుడి ఇంటికి నిప్పు, ఉరేయాలని డిమాండ్

శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం, ఎస్సై వెంకటేష్ సస్పెన్షన్: సీపీ మహేశ్ భగవత్

లిఫ్ట్ ఇచ్చి నమ్మించేవాడు, ఆ తర్వాత దారుణాలకు పాల్పడేవాడు : హజీపురా హత్యలపై సీపీ మహేశ్ భగవత్

శ్రావణిని హత్య చేసిన తర్వాత నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేశాడంటే...?

హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

మృతురాలు మనీషా దయనీయ పరిస్థితి, తల్లిలేదు: బోరుమంటున్న స్థానికులు, బంధువులు

శ్రావణి హత్య కేసు: మూడు చొక్కాలు మార్చిన శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలి: హాజీపూర్ గ్రామస్తుల డిమాండ్

రాఘవన్ సినిమాలో మాదిరిగానే: హాజీపూర్‌లో విద్యార్థినుల హత్యలు

శ్రావణి, మనీషా ఘాతుకాలు: అనుమానితుడు ఇతనే

షాక్: శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో బాలిక శవం

శ్రావణి రేప్‌, హత్య కేసులో పురోగతి: పాత నేరస్తుడి ప్రమేయం

శ్రావణి కేసు: 4 ఏళ్ల క్రితం హజీపూర్‌లో అదృశ్యమైన కల్పన

శ్రావణి కేసు: గ్యాంగ్ రేప్ చేసి, చంపేసి, బావిలో పాతిపెట్టారు

శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: దారుణ విషయాలు గుర్తించిన వైద్యులు

శ్రావణి మృతదేహంతో పిఎస్ ముట్టడి: ఉద్రిక్తత

శ్రావణి హత్య కేసుపై సీపీ స్పందన ఇదీ...(వీడియో)

శ్రావణి హత్య కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

 

Follow Us:
Download App:
  • android
  • ios