Asianet News TeluguAsianet News Telugu

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో  నందమూరి హరికృష్ణ కూతురు  సుహాసినిని చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా బరిలోకి దింపారు.

why chandrababu naidu selected suhasini to contest from kukatpally
Author
Hyderabad, First Published Nov 16, 2018, 4:12 PM IST


హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో  నందమూరి హరికృష్ణ కూతురు  సుహాసినిని చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా బరిలోకి దింపారు. సుహాసినిని బరిలోకి దింపేందుకు ముందుగా స్థానికంగా సమాచారాన్ని సేకరించిన తర్వాత బాబు ఈ నిర్ణయం తీసుకొన్నారని  సమాచారం.

2014 ఎన్నికల్లో  కూకట్‌పల్లి స్థానాన్ని మాధవరం కృష్ణారావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ  ఎన్నికలకు ముందు  మాధవవరం కృష్ణారావు టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరారు.

దీంతో  టీడీపీ  కొత్త అభ్యర్ధిని ఎంపిక చేసుకోవాల్సి ఉంది.  ఈ తరుణంలో  మాజీ మంత్రి  పెద్దిరెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు  రంగం సిద్దం చేసుకొన్నారు. స్థానిక  కార్పోరేటర్  మందాడి శ్రీనివాసరావు కూడ పోటీ చేస్తానని ప్రకటించి ప్రచారాన్ని కూడ ప్రారంభించారు.

కూకట్‌పల్లి స్థానంలో సెటిలర్ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు  ఉంటారు. దీంతో  కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో  నందమూరి కుటుంబం నుండి ఎవరినైనా బరిలోకి దింపాలని  బాబుకు  వినతులు వచ్చాయి.

దీంతో ఈ విషయమై చంద్రబాబునాయుడు కూకట్‌పల్లి నుండి సమాచారాన్ని తెప్పించుకొన్నారు. నందమూరి కుటుంబం నుండి టికెట్టు విషయమై చర్చించారు. 

కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు సినీ రంగంలో బిజీగా ఉన్నారు. కళ్యాణ్‌రామ్‌కు బాబు ఎమ్మెల్యే టికెట్టు ఆఫర్ చేశారు.కానీ  కళ్యాణ్ రామ్ మాత్రం  పోటీకి సుముఖతను వ్యక్తం చేయలేదు. దీంతో నందమూరి కూతురు సుహాసిని పేరును బాబు పరిశీలించారు.

పోటీకి ఆమెను ఒప్పించారు. ఆమె కూడ ఎట్టకేలకు కూకట్‌పల్లి నుండి పోటీ చేసేందుకు సమ్మతించింది.దీంతో  కూకట్‌పల్లి స్థానం నుండి  చంద్రబాబునాయుడు సుహాసిని పేరును గురువారం రాత్రి ప్రకటించారు.

సుహాసినికి టికెట్టు ఇవ్వడం ద్వారా నందమూరి ఫ్యామిలీతో పాటు ముఖ్యంగా హరికృష్ణ కుటుంబానికి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. మరో వైపు ఈ స్థానం నుండి పోటీకి ఇద్దరు నేతల  మధ్య పోటీని కూడ నివారించే అవకాశం ఉందని  భావించారు. ఈ నేపథ్యంలోనే సుహాసినిని బరిలోకి దింపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


సంబంధిత వార్తలు

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

 

Follow Us:
Download App:
  • android
  • ios