Asianet News TeluguAsianet News Telugu

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని ఓడించేందుకు హరీష్‌రావు వేసిన స్కెచ్ పనిచేసింది

what is the secret behind revanth reddy defeat
Author
Kodangal, First Published Dec 13, 2018, 6:00 PM IST

కొడంగల్:కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని ఓడించేందుకు హరీష్‌రావు వేసిన స్కెచ్ పనిచేసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు  రేవంత్ రెడ్డి అరెస్ట్‌ వ్యవహరం  రేవంత్ కు కలిసిరాలేదు. అయితే ఈ వ్యవహరాన్ని అధికార టీఆర్ఎస్  తనకు అనుకూలంగా ఉపయోగించుకొంది.మరో వైపు ఏడాదికి పైగా  ఈ నియోజకవర్గంలో రేవంత్‌కు వ్యతిరేకంగా టీఆర్ఎస్  పావులు కదిపింది.

డిసెంబర్ 4వ తేదీన కొడంగల్‌లో కేసీఆర్ సభ ఉంది.ఈ సభకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలను నిర్వహించాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అరెస్ట్ రేవంత్ రెడ్డికి సానుభూతి వచ్చింది.  కానీ, ఈ సానుభూతి వల్ల రేవంత్ కు కలిసి రాలేదు. సానుభూతిని ఓటు రూపంలోకి మలుచుకొనే ప్రయత్నం పూర్తి కాలేదు.

రేవంత్ రెడ్డి అరెస్ట్‌తో ప్రచారానికి ఒక్క రోజు పూర్తిగా వదిలేసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం ముగింపు డిసెంబర్ 5 వ తేదీతో ముగిసింది.  పోలింగ్ కు  చివరి రోజుల్లో  రేవంత్ రెడ్డి అరెస్ట్  సమయంలో  కాంగ్రెస్ క్యాడర్‌ అంతా రేవంత్  కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో  టీఆర్ఎస్ నేతలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టిని  కేంద్రీకిరించారు. 

కాంగ్రెస్ నేతలంతా రేవంత్ అరెస్ట్‌ గురించి ఆలోచిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు గెలుపుకు అవసరమైన మేనేజ్‌మెంట్‌ను  చేసుకొన్నారు. ఇది రాజకీయంగా టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. 

మరోవైపు రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరులను  టీఆర్ఎస్ తమ వైపుకు తిప్పుకొంది. టీడీపీ నుండి  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ప్రధాన అనుచరులను టీడీపీ నుండి  టీఆర్ఎస్‌లో ఆ పార్టీ చేర్చుకొంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్‌రెడ్డికి  ఎమ్మెల్యే స్థాయి లాంటి పదవిని ఇస్తామని  కోస్గి సభలో కేసీఆర్ హామీ ఇచ్చారు. గుర్నాధ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. 

గత ఏడాది డిసెంబర్ మాసంలో  రేవంత్ రెడ్డి టీడీపీని వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సమయంలో  తన శాసనసభ్యత్వానికి కూడ రేవంత్ రెడ్డి  రాజీనామా చేశారు.ఈ రాజీనామా లేఖను  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడుకు అందించారు. 

 ఆ సమయంలో కొడంగల్ స్థానానికి ఉప ఎన్నికలు  జరుగుతాయని భావించారు. దీంతో  ఉప ఎన్నికల్లో  రేవంత్‌ను ఓడించే  మంత్రాంగాన్ని టీఆర్ఎస్ ప్రారంభించింది. పట్నం నరేందర్ ‌రెడ్డి కొడంగల్ నుండి బరిలోకి దింపాలని  అప్పట్లోనే నిర్ణయం తీసుకొన్నారు.

రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను  కేసీఆర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఉప ఎన్నికలు వస్తాయని భావించి కొడంగల్ నియోజకవర్గంలోని  ఆరు మండలాల్లో  ఐదుగురు మంత్రులు విస్తృతంగా పర్యటించి సుమారు రూ.400 కోట్లకు  పైగా అభివృద్ధి కార్యక్రమాలను  చేపట్టారు.

 రేవంత్‌ను దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్ అనుసరించిన త్రిముఖ వ్యూహం ఈ ఎన్నికల్లో  ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దృష్టిని మల్లించి  ఫలితాన్ని తమ వైపుకు తిప్పుకోవడంలో  టీఆర్ఎస్  ట్రబుల్ షూటర్ హరీష్ రావు వేసిన ఎత్తుగడ ఫలించింది.  రేవంత్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా వేసిన టీఆర్ఎస్ ప్లాన్ సక్సెస్ అయింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios