Asianet News TeluguAsianet News Telugu

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సంస్థ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. కొత్త యాజమాన్యం చేతుల్లోకి సంస్థ వెళ్లడంతో రవిప్రకాష్‌కు ఇబ్బందులు మొదలైనట్టుగా చెబుతున్నారు

what is reason disagreements between alanda media, tv9 ceo ravi prakash
Author
Hyderabad, First Published May 9, 2019, 1:41 PM IST

హైదరాబాద్: టీవీ9 సంస్థ కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లింది. కొత్త యాజమాన్యం చేతుల్లోకి సంస్థ వెళ్లడంతో రవిప్రకాష్‌కు ఇబ్బందులు మొదలైనట్టుగా చెబుతున్నారు. అలంద మీడియా సంస్థ టీవీ9ను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ఎలా జరిగిందో ఓ సారి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. 

టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్‌బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి.

ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది.  

ఏబీసీఎల్ లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకొంది.

ఈ ఒప్పందం కుదిరిన మరునాడే  ఆగస్టు  24,25 తేదీల్లో  డబ్బు కూడా చెల్లించింది.  దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డీ-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగిందిదీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారింది.  ఈ లావాదేవీని గుర్తిస్తూ ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. 

సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరారు.

 ఈ మేరకు ఏబీసీఎల్ సంస్థ గత ఏడాది అక్టోబర్ 23న తొలిసారి తీర్మానాన్ని పంపింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 30న మరోసారి డైరెక్టర్ల బోర్డు మీటింగ్‌లో తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తీర్మానాన్ని  ఏబీసీఎల్ సంస్థ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది.

 ఈ తీర్మానాల మీద ఒకసారి వి.రవిప్రకాశ్, మరోసారి ఎం.కె.వీ.ఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్ కు సమాచారం పంపింది.

 అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారని అలంద మీడియా సంస్థ ఆరోపిస్తోంది.ఏబీసీఎల్‌లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు  ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్‌ఆఫ్‌కంపెనీస్‌కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. 

రవిప్రకాశ్ ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని అలంద మీడియా సంస్థ ఆరోపణలు చేసింది. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని ఆయన వివరించారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌అధికారులు ఏబీసీ‌ఎల్ లో కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించిన పత్రాలను ఆమోదించారు. 

ఈ వ్యవహారంలో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త యాజమాన్యం చేతిలో 90 శాతానికి పైగా వాటా ఉండడంతో కంపెనీ నిర్వహణకు సంబంధించి చట్టప్రకారం వారికే పూర్తి నిర్ణయాధికారం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా నిర్వహణ బాధ్యతలను కొత్త యాజమాన్యం చేపట్టినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే టీవీ9 సీఈఓ రవిప్రకాష్ పాస్‌పోర్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

సంబంధిత వార్తలు

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

 

Follow Us:
Download App:
  • android
  • ios