Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ తో అఫైర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిలకు రాములమ్మ బాసట

సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందని విజయశాంతి అన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

Vijayashanti supports YS Sharmila
Author
Hyderabad, First Published Jan 16, 2019, 7:26 AM IST

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేత, సినీ నటి విజయశాంతి మద్దతుగా నిలిచారు. వైఎస్ షర్మిలపై అసత్య ప్రచారం సాగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

సమాజంలో మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోందని విజయశాంతి అన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మహిళా సెలబ్రిటీలపై విషంకక్కే ఈ విష సంస్కృతిని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 

రాజకీయాల్లో మహిళను అణగదొక్కుతూ, వారిని వేధిస్తూ పురుషాధిక్యత చాటుకునే ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆమె అన్నారు. ఇలాంటి తరుణంలో ఈ తరహా ఘటనలు మహిళలను మానసికంగా కుంగదీస్తాయని ఆమె చెప్పారు.
 
పోలీసులు, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్య తీసుకునే విధంగా యావత్ మహిళా లోకం సోషల్ మీడియా వేదికగా పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇది 40 ఏళ్లుగా సినిమా, రాజకీయాలలో మహిళా సాధికారత కోసం పోరాడిన వ్యక్తిగా తన స్పష్టమైన అభిప్రాయమని ఆమె చెప్పారు.

సంబంధిత వార్తలు

షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

దగుల్బాజీ, గజ్జి కుక్కలు: వైఎస్ షర్మిల ఇష్యూపై చిన్నికృష్ణ

బాబుకు అలవాటే, చిరుపై లాగానే వైఎస్ షర్మిలపై..: పోసాని

షర్మిల ఫిర్యాదుపై కేసు: దర్యాప్తునకు ప్రత్యేక బృందం

షర్మిలపై కామెంట్స్.. మాకేం సంబంధం లేదన్న బుద్ధా

సైబర్ సెల్ కు పిటిషన్: సెంటిమెంట్ తో కొట్టిన షర్మిల

మా అన్నయ్య జగన్‌పై కూడా పుకార్లు :షర్మిల

నా క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం: పోలీసులకు ఫిర్యాదు చేసిన షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

ప్రభాస్ తో ఎఫైర్.. స్పందించిన వైఎస్ షర్మిల!

Follow Us:
Download App:
  • android
  • ios