Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీకి ఆ విషయం తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు: బీజేపీపై విజయశాంతి ఫైర్

తీవ్రవాదం వల్ల కలిగే నష్టం గురించి బిజెపి నేతలు చెప్తే వినాల్సిన పరిస్థితిలో రాహుల్ గాంధీ లేరన్నారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలు తీవ్రవాదుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారని కాబట్టి ఆ బాధ ఏంటో రాహుల్ గాంధీకి బాగా తెలుసునన్నారు. 

 

vijayashanthim slams bjp
Author
Hyderabad, First Published Mar 12, 2019, 4:44 PM IST

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదిని జీ అన్నందుకు రాహుల్ గాంధీ పెద్ద నేరం చేసినట్లు బిజెపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారంటూ విజయశాంతి మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ దేశభక్తిని బీజేపీ నేతలు శంకిస్తున్నారంటూ విజయశాంతి మండిపడ్డారు. తీవ్రవాదం వల్ల కలిగే నష్టం గురించి బిజెపి నేతలు చెప్తే వినాల్సిన పరిస్థితిలో రాహుల్ గాంధీ లేరన్నారు. తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలు తీవ్రవాదుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయారని కాబట్టి ఆ బాధ ఏంటో రాహుల్ గాంధీకి బాగా తెలుసునన్నారు. 

పాక్ తీవ్రవాదిని ఉద్దేశించి జీ అనడం నేరం అంటున్న బీజేపీ నేతలు తన తండ్రి రాజీవ్ గాంధీ గారిని అమానుషంగా హత్య చేసిన ఎల్టీటీఈ సభ్యులకు విధించిన మరణ శిక్షను కూడా రద్దు చేయమని చెప్పి మనవతా వాదాన్ని చాటుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ కొనియాడారు. 

అంటే ఉరిశిక్షను రద్దు చేయమని చెప్పడం వల్ల రేపు రాహుల్ గాంధీ ఎల్టీటీఈ తీవ్రవాదులతో కుమ్మక్కయ్యారని ప్రచారం చేస్తారా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గారిని విమర్శించడానికి కారణం దొరక్క చివరకు ఇలాంటి చిల్లర రాజకీయాలతో బీజేపీ లబ్ధి పొందాలని చూడటం శోచనీయమన్నారు. 

ఇంతకీ పాక్ తీవ్రవాది ని జీ అన్నందుకు తెగ రెచ్చిపోతున్న బీజేపీ నేతలు అసలు కాందహార్ హైజాక్ జరిగినప్పుడు పాక్ తీవ్రవాది ని గౌరవంగా పువ్వుల్లో పెట్టి పాక్ వద్ద వదిలిన ఘనత మీది కాదా అంటూ నిలదీశారు. 

గతాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. తీవ్రవాదులను జీ అనడం నేరమైతే ఏకంగా తీవ్రవాదిని గౌరవంగా సాగనంపటం నేరం కాదా? అంటూ మండిపడ్డారు. ఇటువంటి దిగజారుడు ప్రచారాలను బీజేపీ నేతలు మానుకోవడం మంచిదని విజయశాంతి హితవు పలికారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios