Asianet News TeluguAsianet News Telugu

ఈవీఎంల గోల్ మాల్ తో కేసీఆర్ సీఎం అయ్యారు.. విజయశాంతి

తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడకు చెంప పెట్టులా మారాయని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.

vijayashanthi comments on kcr over MLC elections
Author
Hyderabad, First Published Mar 27, 2019, 3:43 PM IST

తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడకు చెంప పెట్టులా మారాయని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభిప్రాయపడ్డారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ దయతో, ఈవీఎంల గోల్ మాల్ తో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని ఆమె పేర్కొన్నారు. రెండోసారి సీఎం అయిన వెంటనే కేసీఆర్ పాలన వైపు దృష్టి సారించకుండా, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని, ఈ కుట్రలను తిప్పి కొట్టే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు తమ తీర్పునిచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. 

మరోవైపు టీఆర్‌ఎస్‌కి 16 ఎంపీ సీట్లను కట్టబెడితే కేసీఆర్ ప్రధాని అవుతారన్న భయం విద్యావంతుల్లో కలిగిందని, అందుకే వారు టీఆర్‌ఎస్‌ని ఓడించారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ఫలితాలు కేసీఆర్‌కి కనువిప్పు కలిగించక పోయినా, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిని ఎమ్మెల్యేలు ఆత్మశోధన చేసుకుంటారని తాను భావిస్తున్నానని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios