Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో పోలీసుల సోదాలు.. వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం

గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటున్న ఆయన కుమారుడు విజయ్ రెడ్డి ఇంట్లో అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు

Vanteru pratap reddy suicide attempt
Author
Hyderabad, First Published Nov 27, 2018, 7:52 AM IST

గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్ కొంపల్లిలో ఉంటున్న ఆయన కుమారుడు విజయ్ రెడ్డి ఇంట్లో అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించారు.

దీనిపై ప్రతాప్ రెడ్డి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. రెండు, మూడు రోజులుగా పోలీసలు తనను వెంటాడుతున్నారని.. ప్రచారం చేసుకోవడానికి కూడా వెళ్లలేకపోతున్నానని వివరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆయన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

అయితే అక్కడున్న కుటుంబసభ్యులు, పోలీసులు ప్రతాప్‌రెడ్డిని అడ్డుకున్నారు. మరోవైపు గజ్వేల్‌లో పోలీసులు, ఎన్నికల అధికారులు టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తూ.. నిన్న ఉదయం వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తరుపున స్వయంగా పోలీసులే డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో వందల కోట్ల డబ్బులున్నాయని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. 

వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలు

ఈసీతో వంటేరు సమావేశం...కేసీఆర్ ఫాంహౌస్‌పై సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ పై పోటీ: ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సీరియస్, ఆస్పత్రిలో చికిత్స

వంటేరు దీక్షను భగ్నం చేసిన పోలీసులు (వీడియో)

హరీశ్! యాది పెట్టుకో.. నీ రబ్బరు చెప్పులు మళ్లొస్తయ్: వంటేరు

Follow Us:
Download App:
  • android
  • ios