Asianet News TeluguAsianet News Telugu

టీవీ9 మాజీ సిఈవో రవిప్రకాష్ అరెస్టు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను హైదరాబాదు బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై రివిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు.

TV9 case: EX CEO Ravi prakash arrested
Author
Hyderabad, First Published Oct 5, 2019, 12:41 PM IST

హైదరాబాద్: టీవీ9 న్యూస్ చానెల్ మాజీ సీఈవో రవిప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీవీ9 చానెల్ కార్యాలయానికి వెళ్లినప్పుడు పోలీసుల విధులకు రవిప్రకాష్ ఆటంకం కలిగించారని అభియోగం మోపారు.

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ కి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ లో ఉన్న నిబంధనలను తొలగించాలంటూ రవి ప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును అభ్యర్థించారు. కాగా ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

టీవీ9 ఛానెల్ లో పలు ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవి ప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios