Asianet News TeluguAsianet News Telugu

కూటమి ప్రతిపాదన నాదే, ఆశీర్వదించండి:ఎల్ రమణ

టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడాలన్న ఉద్దేశంతోనే ప్రజాకూటమి ఏర్పడిందని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. శుక్రవారం మేడ్చల్ లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

TTDP PRESIDENT L RAMANA COMMENTS ON TRS
Author
Medchal, First Published Nov 23, 2018, 8:32 PM IST

మేడ్చల్: టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడాలన్న ఉద్దేశంతోనే ప్రజాకూటమి ఏర్పడిందని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ స్పష్టం చేశారు. శుక్రవారం మేడ్చల్ లోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రమణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

36ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మెుట్టమెదటి సారిగా కాంగ్రెస్ పార్టీ వేదికపై నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. 1978లో తాను కాంగ్రెకస్ కార్యకర్తగా ఉన్నానని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష స్థాయిలో ఉన్నానని చెప్పారు. 

తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం కాంగ్రెస్‌తో కలిసి కూటమిగా ఏర్పడాలన్న ప్రతిపాదనను తానే తెచ్చానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో టీజేఏసీ అధినేత కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వద్ద ప్రతిపాదన తెచ్చినట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల రాజ్యాంగం అవసరం లేదని అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగమే కావాలని అభిప్రాయపడ్డారు.  తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానన్న దొర తానే పీఠమెక్కి మాట తప్పాడని విమర్శించారు. దొర పాలనలో తెలంగాణకు ఆత్మగౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణలో 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పేదలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. ప్రజలను అడుగడునా మోసం చేసిన టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడి ప్రజాకూటమిని ఆశీర్వదించాలని కోరారు.
 
ప్రజాస్వామ్య విలువలకు కేసీఆర్‌ పాతరవేశారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను కేసీఆర్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటూనే అప్పులు చేశారని వెల్లడించారు. కేసీఆర్‌ నిరంకుశంగా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ నిరంకుశ పాలనకు సమాధి కడతాం,ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం: కోదండరామ్

సోనియా సంకల్పంతోనే తెలంగాణ: రాహుల్ గాంధీ

ఏళ్ల తర్వాత నా బిడ్డల వద్దకు వచ్చినట్లుంది: సోనియా

సీన్ రివర్స్: 'చేయ్యె'త్తి జైకొడుతున్న ఉద్యమ నేతలు

సెంటిమెంట్: తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి సోనియా

ఉద్యోగులకు, పేదలకు ఉత్తమ్ వరాల జల్లు

రెండు రోజుల్లో మా వైపు టీఆర్ఎస్ కీలక నేతలు: ఉత్తమ్ సంచలనం

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి: రంగంలోకి దిగిన ఆరుగురు అగ్రనేతలు

 

Follow Us:
Download App:
  • android
  • ios