Asianet News TeluguAsianet News Telugu

యాదాద్రిలో ఎంపి కవిత హల్ చల్

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కవితకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఆలయ అధికారులు యాదాద్రి అభివృద్ధి ప్లాను ను వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రాకారాలు, భక్తులకు సౌకర్యాలు తదితర నిర్మాణాలను చూశారు. ఎంపీ కవిత వెంట విప్ సునీత, మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి గుంతకండ్ల సునీత ఉన్నారు. అనంతరం మిడియాతో మాట్లాడారు.

యాదాద్రి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు ఎంపి కవిత. కనీ, వినీ ఎరుగని రీతిలో యాదాద్రి ఆలయాన్ని  సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవ ప్రతీకగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. రూ.650 కోట్లు వ్యయంతో యాదాద్రి అద్భుత కట్టడంగా రూపొందుతున్నదన్నారు. రూ.2వేల కోట్లతో మహాద్భుత కట్టడం రూపొందాలన్నారు. పురాణాల్లో చదువుకున్నట్లుగా యాదాద్రి ఆలయంలో ఒక్కో శిల్పాన్ని రాతి నుంచి చెక్కి   అందంగా మలుచుతున్నారని అన్నారు.

సింగిల్ స్టోన్ నుంచి కళారూపాలు రూపొందుతున్నాయన్నారు. రేయింభవళ్ళు , శిల్పులు  చెమటోడ్చి   శిల్పాలు చెక్కుతున్నారని చెప్పారు కవిత. మంత్రి జగదీశ్ రెడ్డి, విప్ సునీత పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. యాదాద్రిలో జరుగుతున్న పనులను ప్రజలు చూడాలని ఎంపీ కవిత కోరారు. తెలంగాణా ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండలంటే యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులు మనకు కావాలన్నారు.

trs mp kavitha visits yadadri

Follow Us:
Download App:
  • android
  • ios