Asianet News TeluguAsianet News Telugu

ముస్లిం కోటాపై మోడీకి కేసీఆర్ సవాల్

కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు ప్రధాని మోదీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులు ఏకమయ్యారని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఒక్కడిని డీ కొట్టేందుకు ఇంతమందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతమంది తనపైకి వస్తున్నారని మీరే కాపాడాలంటూ కేసీఆర్ ప్రజలను కోరారు.
 

trs chief kcr fires on narendramodi
Author
nagarjunasagar, First Published Nov 27, 2018, 5:09 PM IST

నల్గొండ: కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు ప్రధాని మోదీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడులు ఏకమయ్యారని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఒక్కడిని డీ కొట్టేందుకు ఇంతమందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతమంది తనపైకి వస్తున్నారని మీరే కాపాడాలంటూ కేసీఆర్ ప్రజలను కోరారు.

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. మోదీకి దమ్ముంటే తాను ప్రతిపాదించిన ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై స్పందించి ఢిల్లీ వెళ్లాలని సవాల్ విసిరారు. 

ప్రధాన పోటీ ప్రజాఫ్రంట్ మరియు టీఆర్ఎస్ పార్టీల మధ్యేనని కేసీఆర్ చెప్పారు. జానారెడ్డి కొత్త వాడు కాదని, కేసీఆర్ కొత్తవాడు కాదని ఎవరూ ఆకాశం నుంచి ఊడిపడలదేని అయితే ఎవరు అభివృద్ధి చేశారో అన్నదే చూడాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు పక్కనే ఉన్నా కనీసం సాగునీరు అందించలేని ప్రభుత్వాలు కాంగ్రెస్ టీడీపీలు అని కేసీఆర్ విమర్శించారు. తాము అన్నింటిని అధిగమించి సాగునీరందించామన్నారు. 

కాంగ్రెస్ పార్టీ హయాంలో విద్యుత్ సరఫరా ఎలా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో రైతుల సమస్యలు అన్నీ ఇన్నీ కావన్నారు. 

ఎన్నికల సమయంలో ప్రజలు పరిణితితో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజలు పరిణితితో ఆలోచిస్తారని ఆ పరిణితి మనరాష్ట్రంలో లేదన్నారు. అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని కేసీఆర్ స్పష్టం చేశారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 43 వేల కోట్ల రూపాయలతో పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, బోదకాలు బాధితులకు పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. 

దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చెయ్యని విధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు చనిపోతే వారికి భీమా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3వేల 400 మందికి ఈ పథకాలు అందుకున్నారని తెలిపారు. 

అలాగే కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా లక్ష 16వేలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే కంటి వెలుగు పరీక్షలు ఏ రాష్ట్రంలో చెయ్యడం లేదన్నారు. ఎన్నికల తర్వాత చెవి, ముక్కు, గొంతు, దంతవైద్య పరీక్షలు కూడా చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీ ఒక్కరి రక్త గ్రూపులు తెలుసుకునేలా వైద్యులు త్వరలోనే మీ ఇంటికి వస్తారన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణయే తన లక్ష్యమన్నారు. 

భారతదేశంలో ధనవంతులైన గొల్లకురుములు యాదవులు ఎక్కడ ఉన్నారని ఆరా తీస్తే తెలంగాణ వైపు చూడాల్సి వస్తుందని తెలంగాణలోనే యాదవులు ధనవంతులు అవుతారన్నారు. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం 24 గంటల విద్యుత్ తోపాటు అందిస్తామని హామీ ఇచ్చారు. తాను బతికి ఉన్నంత కాలం రైతు బంధం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. 

తెలంగాణలో ముందస్తు ఎన్నికల అనంతరం ఒక్క నెలలోనే పంచాయితీ ఎన్నికలు జరగబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 70 తండాల్లో ఎస్టీ సోదరులు రాజ్యమేలనున్నట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో ఉల్టాపల్టా మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ విమర్శించారు. దేశానికి ప్రధాని అయి ఉండి తనపై ఆరోపణలా అంటూ మండిపడ్డారు. తన సమావేశాలకు 80వేల మంది వస్తే ప్రధాని మీటింగ్ కు కేవలం 15వేల మంది కూడా లేరన్నారు. 

ఇటీవలే తెలంగాణలో పర్యటించిన యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు తాను బీజేపీతో కలిశానని ఆరోపిస్తారని ఇప్పుడు మోడీ వచ్చి తాను సోనియాగాంధీతో కలిసిపోయానని చెప్తున్నారని ఇంతకీ తాను ఎవరితో కలిశానో ప్రజలే నిర్ణయించాలన్నారు. 

తాను ఎవరితో కలవలేదని తాను ప్రజలతో ఉన్నట్లు తెలిపారు. గతంలోనూ ఇప్పుడు తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. తనకు ఎలాంటి సందేహం లేదని డిసెంబర్ 11న ప్రకటించే ఫలితాల్లో 105 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపొందుతామని తెలిపారు.  

అటు రాష్ట్రంలో 17 ఎంపీలను కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ కోరారు. 17 మంది ఎంపీలు గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీ యేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని ఆ దిశగా తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంతో మదమెక్కి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. అధికారంతో ఇరు పార్టీలు విర్రవీగుతున్నాయన్నారు. కేసీఆర్ పట్టుబడితే మెుండిపట్టు పడతాడని, ఆషామాషీ రాజకీయాలు చెయ్యడన్నారు. 

మోదీకి కానీ కాంగ్రెస్ కు కానీ తాను భయపడేది లేదన్నారు. చంద్రబాబులా తాను భయపడనన్నారు. తాను అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి కేసులు లేవన్నారు. ప్రజలు నా వెంట ఉన్నారన్న కడుపు మంటతో తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజాకూటమికి ఓటెస్తే అరాచకమే,టీఆర్ ఎస్ కు ఓటేస్తే సంక్షేమం:కేసీఆర్

నేను ఏ పూజ చేసుకుంటే నీకెందుకు: మోడీకి కేసీఆర్ కౌంటర్

Follow Us:
Download App:
  • android
  • ios