Asianet News TeluguAsianet News Telugu

ఒక్క రేవంత్.. ఐదుగురు మంత్రులు.. 5 గంటలు.. టెన్షన్ టెన్షన్

  • రేవంత్ కు షాక్ ఇవ్వబోయిన తెలంగాణ మంత్రులు
  • రేవంత్ ను కట్టడి చేయడంలో టిఆర్ఎస్ వ్యూహాలు
  • దీనికోసం కింద మీదా అయిన పాలమూరు మంత్రులు
  • ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన మంత్రులు
Trs attempt to wean away followers from revanth fizzles out

అవును నిజమే. రేవంత్ రెడ్డి ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో తలపండిన నాయకుడేం కాదు. వయసులోనూ చిన్నవాడే. పైగా ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వాడు కూడా. ఆయన ప్రస్తుతం ఉన్న పార్టీ తెలంగాణలో భూస్థాపితం అయిందన్న ప్రచారం కూడా ఉంది. మరి ఆ రేవంత్ రెడ్డి తెలుగు రాజకీయాలను శాసిస్తున్నాడు. ఏకకాలంలో కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్, బిజెపి, లెఫ్ట్ పార్టీలన్నింటినీ తనవైపు తిప్పుకున్నాడు. తాజా రాజకీయాలలో ఆయన గురించి మాట్లాడని నేతలు లేరు.

అలాంటి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు తెలంగాణలో ఐదుగురు మంత్రులు రంగంలోకి దిగారు. ఐదు గంటల పాటు తలా కొద్దిసేపు శ్రమించారు. అయినా రేవంత్ రెడ్డికి షాక్ ఇయ్యలేదు కదా? తుదకు వారే షాక్ కు గురయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ షాకుల వార్త ఏంటబ్బా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

మొన్న శుక్రవారం తెలంగాణ టిడిపి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. సమావేశంలో సీనియర్ నేతలు మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ రేవంత్ తీరును ఎండగట్టారు. అసలు రాహుల్ గాంధీని ఎందుకు కలిశావో చెప్పాలంటూ నిలదీశారు. దీనికి రేవంత్ కలిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించారు. ఆ తర్వాత మీటింగ్ నుంచి మోత్కుపల్లి, అరవింద్ గౌడ్ వాకౌట్ చేశారు. అదే సమయంలో మీటింగ్ అయిపోయింది. తర్వాత మోత్కుపల్లి రేవంత్ మీద విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో ముద్దాయి, రేవంత్ వల్ల టిడిపికి నష్టమే తప్ప లాభం లేదంటూ ఘాటుగానే తిట్టారు మోత్కుపల్లి.

అయితే గత నాలుగైదు రోజులుగా తెలుగు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా నిలిచాడు. ఆయన రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన నాటినుంచి ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి మీదనే చర్చలు జరిగే స్థాయి వచ్చింది. ఈ టెంపో అలాగే కంటిన్యూ కాకుండా బ్రేక్ చేసేందుకు టిఆర్ఎస్ మంత్రులు రంగంలోకి దిగారు. రేవంత్ కు ఎలాగైనా షాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో నుంచి నాయకులను టిఆర్ఎస్ లోకి రప్పించేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు.

Trs attempt to wean away followers from revanth fizzles out

ఇక సీన్ కట్ చేస్తే.. కొడంగల్ నుంచి 200 మంది రేవంత్ అనుచరులంతా టిఆర్ఎస్ లోకి చేరబోతున్నారంటూ హైదరాబాద్ మీడియాకు లీకులు అందాయి. మంత్రి కేటిఆర్ సమక్షంలో వారంతా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని ముందుగా చెప్పారు. దీంతో స్టేట్ మీడియా తెలంగాణ భవన్ కు ఉరికింది. అయితే ఆ కార్యక్రమం ఎప్పుడెప్పుడా అని మీడియా ఎదురుచూసింది. గంటల సమయం గడుస్తున్నా చేరికలు లేవు. అయితే 200 మంది కార్యకర్తలు రాలేదని మంత్రి కేటిఆర్ కు సమాచారం అందినట్లుంది... కేటిఆర్ ఆ కార్యక్రమానికి రావడంలేదు. ఆయన వేరే పనిలో ఉన్నారంటూ మల్లా ఒక లీక్ అందింది. హోంమంత్రి నాయిని ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటాయని మల్లా లీక్ వచ్చింది. తీరా కొడంగల్ నుంచి చేరేందుకు వస్తారనుకున్న వాళ్లు రాలేదు. దీంతో నాయిని కూడా కొద్దిసేపు వారి కోసం ఎదురుచూశారు. తర్వాత నాయిని కూడా ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని మల్లా సమాచారం అందింది.

ఇక రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చే ఉద్దేశంతో పాలమూరుకు చెందిన ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు, అవంచ లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. కొడంగల్ నుంచి వందల మందిని తరలించే ప్రయత్నం చేశారు. నాయనో భయానో వాళ్లను పార్టీలోకి తీసుకోచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేసారు. అయితే కొడంగల్ నియోజకవర్గం నంచి పిల్ల కూడా కదలలేదు. బతిలాడో మరేదో చేసి మొత్తం మీద ఐదారుగురిని అతి కష్టం మీద సాయంత్రం 7 గంటలకు తెలంగాణ భవన్ కు తీసుకొచ్చారు. గంట పాటు వేచి చూసినా.. అసలు వస్తామన్న ZPTC, MPP రాలేదు. ఎక్కడ పరువు పోతుందోనన్న భయంతో ZPTC అనసూయ భర్త బాల్ సింగ్, MPP భర్తకు కండువాలు కప్పి వాల్లే ప్రజా ప్రతినిధులుగా భ్రమింప చేసారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి. ZPTC, MPP లకు కండువ కప్పకుంటే పరువు పొతుందని భయపడ్డారు.

అంతన్నారు.. ఇంతన్నారు...చివరికి ఊసురుమనిపించారనే అపవాదు మోయాల్సి వస్తదని ఆందోళన చెందారు. అందుకు ZPTC, MPP లు వచ్చే వరకు తెలంగాణ భవన్ లోనే నిరీక్షించారు. ఏలాగోలా ఒప్పించి ZPTC, MPP లను రాత్రి 11 గంటలకు తెలంగాణ భవన్ కు తీసుకవచ్చారు. అప్పటి వరకు మంత్రులు ఒకరి ముఖాలు మరోకరు చూసుకుంటూ గడిపారు. రాత్రి 11 గంటల తర్వాత ZPTC అనసూయ, మరో MPP మీద కండువాలు కప్పి తెలంగాణ భవన్ నుంచి బయటపడ్డారు. ఒక ZPTC, ఒక MPP కోసం ఐదు గంటల పాటు ముగ్గురు మంత్రులు హైరానా పడడం టీఆర్ ఎస్ లో మాత్రం చర్చానీయాంశమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు పార్టీలు మారినప్పుడు కూడా ఇంతగా టెన్షన్ పడలేదని గుర్తు చేస్తున్నారు. అలాంటిది రేవంత్ నియోజక వర్గం నుంచి ఇద్దరు స్థానిక ప్రజా ప్రతినిధులను చేర్చుకునేందుకు అపసోపాలు పడాల్సి వచ్చిందని గుసగుస లాడుతున్నారు.

మరోవైపు మంత్రి ఈటల ఆ సభలో మాట్లాడిన సమయంలో ఎదురుగా ఉన్న వారిని చూపించలేదు. ఎవరెవరు పార్టీలో చేరినారో కూడా వివరాలు మీడియాకు ఇవ్వలేకపోయారు. ఇంకా గమ్మత్తేమంటే ఈ కార్యక్రమంలో పాలమూరుకు చెందిన మాజీ మంత్రి పి.రాములు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి,  ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ నేత బమ్మెర రామ్మూర్తి, పాలమూరు మైనార్టీ నేత ఇంతియాజ్ లాంటి వాళ్లు కూడా తలా ఒక చెయ్యి వేశారు. అంత చేస్తే పట్టుమని ఐదుగురిని కూడా జాయిన్ చేపించుకోలేకపోయారని టిఆర్ఎస్ నేతల్లోనే చర్చలు జోరందుకున్నాయి. అయితే మంత్రులు నాయిని, కేటిఆర్ ల పేర్లు ఈ ఎపిసోడ్ లో ప్రచారంలోకి వచ్చినాయి తప్ప వారు ఎలాంటి ఎఫర్ట్ పెట్టలేదని ఒక టిఆర్ఎస్ నాయకుడు ఏషియా నెట్ కు వెల్లడించారు. ఇంకో మంత్రి ఈటల రాజేందర్ కు కూడా సంబంధం లేదని కేవలం పాలమూరు మంత్రులు మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios