Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌వి గలీజు రాజకీయాలు, సీఎల్పీ విలీనంపై న్యాయపోరాటం: ఉత్తమ్

2014లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణలో రాజకీయాన్ని భ్రష్టు పట్టించారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించడంతో ఆయన స్పందించారు. 

tpcc chief uttam kumar reddy makes comments on cm kcr
Author
Hyderabad, First Published Jun 6, 2019, 8:46 PM IST

2014లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కేసీఆర్ తెలంగాణలో రాజకీయాన్ని భ్రష్టు పట్టించారన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీఆర్ఎస్‌ఎల్పీలో సీఎల్పీ విలీనమైనట్లు స్పీకర్ ప్రకటించడంతో ఆయన స్పందించారు.

తన కోసం, తన కుటుంబం కోసం కేసీఆర్ సమాజాన్ని, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తాము కేసీఆర్‌కు సహకరించామని .. అయితే అప్పటి నుంచి ఆయన వికారంగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కొనుక్కుంటూ.. వాళ్లపై అనర్హత పిటిషన్ ఇస్తే స్పీకర్ పట్టించుకోలేదని ఉత్తమ్ తెలిపారు. స్పీకర్‌కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్ధాయిలో రాజ్యాంగం హోదాను కల్పించిందని... అయితే తెలంగాణ సభాపతి ఆ స్ధాయికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రహస్య ప్రదేశంలో కలిసి స్పీకర్ విలీన ప్రక్రియను పూర్తి చేశారని పేర్కొన్నారు. దళితుడు, ముస్లిం ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్‌కు నచ్చదా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. పార్టీ మారకుంటే అరెస్ట్ చేస్తామని రోహిత్ రెడ్డని నవీన్ రావు బెదిరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

విలీనంపై శుక్రవారం హైకోర్టుకు వెళుతున్నామని... అక్కడి తీర్పును అనుసరించి సుప్రీంకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిదన భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios