Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఒంటరి, మంత్రులు కూడా లేరు: విజయం మనదేనన్న ప్రొ.కోదండరామ్

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఒంటరి అయిపోయారని విమర్శించారు. కేసీఆర్ వెంట కనీసం మంత్రులు కూడా లేరని చెప్పుకొచ్చారు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని కోదండరామ్ తెలిపారు. 

TJS Chief Kodandaram comments in sakala janula samara bheri sabha
Author
Hyderabad, First Published Oct 30, 2019, 7:14 PM IST

హైదరాబాద్:  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విజయవంతంగా జరుగుతున్నందుకు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు టీజేఎస్ తోపాటు అఖిలపక్షం అండగా ఉంటుందని తెలిపారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె కోసం ఆర్టీసీ సిబ్బంది బస్సులు ఎక్కి ప్రభుత్వంపై పోరాటానికి వచ్చారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె దేశచరిత్రలోనే నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. సకల జనుల సమరభేరి సభకు దూర ప్రాంతాల నుంచి సైతం కార్మికులు వచ్చి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంప కార్మికుల జెండా ఎగురవేశారని తెలిపారు. 

ఆర్టీసీ కార్మికుల సభ ప్రపంచానికి తెలియజేసేలా ఎర్రజెండా రెపరెపలాడేలా కార్మికులు తరలిరావడం గొప్ప విషయమన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ జీతాలు పెంచమని అడగడం లేదని, ప్రమోషన్లు ఇవ్వాలని అడగడం లేదని ఆర్టీసీ పరిరక్షణే ధ్యేయంగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. 

ఆర్టీసీని బతికించండి, తమకు బతికి చూపండి తెలంగాణకు దారి చూపండి అనే నినాదంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని వ్యాఖ్యానించారు కోదండరామ్. అంతే తప్ప ఇతర కోరికలు ఏమీ కోరడం లేదని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ ఆస్తులను కాపాడటం కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారని అందువల్లే తామంతా వారికి అండగా ఉన్నామని  కోదండరామ్ తెలిపారు. ఈ సమ్మె ప్రపంచంలో ఎన్నడూ జరగని రీతిలో కొనసాగుతుందన్నారు. 

శాంతియుత వాతావరణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఆర్టీసీకి అనేక ఇబ్బందులు ఉన్నాయని వాటిని ప్రభుత్వమే భరించాలని కోరినట్లు తెలిపారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. 

ఆర్టీసీని బతికించేందుకే తాము సమ్మెబాట పట్టామని ఆర్టీసీ కార్మికులు చెప్తుంటే....ప్రభుత్వం మాత్రం సెల్ఫ్ డిస్మిస్ అంటూ రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తుందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల వల్లే నష్టాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆర్టీసీ కార్మికుల వల్లే నష్టాలు ఏర్పడ్డాయని ప్రభుత్వం నిందలు వేయడం నిజంగా కార్మికులను అవమానించడమేనని కోదండరామ్ స్పష్టం చేశారు. ఆర్టీసీని నడపడం అంటే ఆర్టీసీ కార్మికులకు చాలా ఇబ్బందులు పడతారని చెప్పుకొచ్చారు. 

ఎండనకా, వాననకా, చలిలోనూ తట్టుకుని ఆర్టీసీ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు చాలా తక్కువ అని చెప్పుకొచ్చారు. ఇటీవలే నల్గొండలో చనిపోయిన ఆర్టీసీ డ్రైవర్ జమీల్ జీతం 21 వేలు అయితే ఇంటికి తీసుకువెళ్లేది కేవలం రూ.9వేలేనని చెప్పుకొచ్చారు. 

ఈ తొమ్మిదివేలతో ఎలాగో నెట్టుకొస్తున్న ఆయనకు ఇప్పుడు ఉద్యోగం కూడా లేకపోతే పరిస్థితి ఎలా అని ఆందోళనతో చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికే పదిహేను మంది చనిపోయారని ఇంకెంతమంది చనిపోతే ప్రభుత్వం దిగివస్తుందని కోదండరామ్ నిలదీశారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని సూచించారు. హైకోర్టు సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వంలో కదలిక రావడం లేదన్నారు. 

విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తమకు మద్దతుగా నిలిచినా ప్రభుత్వంలో కదలిక రావడం లేదన్నారు. ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

చర్చలకు పిలిచి ప్రభుత్వం అధికారులు ఆర్టీసీ జేఏసీ నేతలను అవమానించారని తెలిపారు. యుద్ధఖైదీలను తీసుకెళ్లినట్లు చర్చలకు తీసుకెళ్లారని ఆరోపించారు. అధికారులు నిర్బంధంగా సంతకాలు పెట్టించేందుకు ప్రయత్నించినా, ఒత్తిడిపెంచినా కార్మిక సంఘాల నేతలు ధైర్యంగా బయటకు వచ్చేయడం అభినందించదగ్గ విషయం అన్నారు. 

ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఒంటరి అయిపోయారని విమర్శించారు. కేసీఆర్ వెంట కనీసం మంత్రులు కూడా లేరని చెప్పుకొచ్చారు. కానీ ఆర్టీసీ కార్మికుల వెంట అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని కోదండరామ్ తెలిపారు. 

విజయానికి ఎంతో దూరంలో లేమని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా తాము అండగా ఉంటామని కోదండరామ్ తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్: అశ్వత్థామరెడ్డి పిలుపు

RTC Strike:జగన్‌ను లాగి ఆర్టీసీ విలీనంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios