Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది. మే14 లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Telangana ready for another election
Author
Hyderabad, First Published Apr 13, 2019, 5:46 PM IST

హైదరాబాద్‌: వరుస ఎన్నికలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే అసెంబ్లీ, పంచాయితీ, పార్లమెంట్ ఎన్నికల వేడిని చల్లారకుండానే మళ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది. మే14 లోపు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించింది. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాతే ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. 

ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి ఎన్నికల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. 

స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో ఈ నెల 22 నుంచి మే14వ తేదీ వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదికగానే జరగనున్నాయి. 

రాష్ట్రంలోని మొత్తం 5857  ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలకు గానూ ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

పోలింగ్ విరాలు:
మొదటి దశ పోలింగ్‌ తేదీ: 06.05.2019

రెండో దశ పోలింగ్‌ తేదీ:     10.05.2019

మూడో దశపోలింగ్‌ తేదీ:     14.05.2019

Follow Us:
Download App:
  • android
  • ios