Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు పదో తరగతి లోపు విద్యార్ధులు అర్హులు. 

telangana police department invited to participate online essay writing competition over "Police Commemoration Week"
Author
Hyderabad, First Published Oct 15, 2019, 6:21 PM IST

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు పదో తరగతి లోపు విద్యార్ధులు అర్హులు. గురువారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు ఆన్‌లైన్‌లో ఈ పోటీ జరుగుతుంది.

* ‘‘ IF I WERE THE POLICEMAN’’ ‘‘ నేనే పోలీస్ అయితే ’’ అన్న అంశంపై విద్యార్ధులు వ్యాసాన్ని రాయాల్సి వుంటుంది

* అనంతరం https://docs.google.com/a/asianetnews.in/forms/d/e/1FAIpQLSduBAVd-ocGNHEmTempvweVNDN_ktFzsukbe4_zx3ufp6s8sw/closedform ఈ లింక్‌లోకి వెళ్లి విద్యార్థులు తమ పేరు, తరగతి, ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 

* అక్కడ వ్యాసం కోసం ఉద్దేశించిన స్థలంలో దానిని నింపాలి. ఈ లింక్ గురువారం ఉదయం 10.30 నుంచి 12.00 వరకు యాక్టివేట్ అయి ఉంటుంది. 

జిల్లా, నగర స్థాయిల్లో మొదటి ఉత్తమ వ్యాసాలను ప్రకటించి వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలుపుతామని పోలీస్ శాఖ తెలిపింది. మొత్తం వ్యాసాల్లో మొదటి మూడింటిని రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వ్యాసాలుగా ఎంపిక చేస్తామని ప్రకటించింది. 

భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సాయ్‌చిన్ వద్ద సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కాపలా కాస్తున్నారు. 1959 అక్టోబర్ 21న ఎముకలు కొరికే చలిలో పదిమంది పోలీసులు.. చైనా సైనికులకు ఎదురొడ్డి నిలిచారు.

చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వీరి త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios