Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ కోలుకునే ఛాన్స్ లేదు.. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎర్రబెల్లి

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగటాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆర్టీసీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 

telangana ministr errabelli dayakar rao makes comments on rtc strike and upcoming municipal elections
Author
Hyderabad, First Published Nov 4, 2019, 2:57 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగటాణ భవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఆర్టీసీ కోలుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ఆర్టీసీ కార్మికులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని... కేవలం యూనియన్లపై మాత్రమే సర్కార్ సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి కొంత వ్యతిరేకత వున్న మాట వాస్తవమేనని ఎర్రబెల్లి అంగీకరించారు.

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాలు ప్రకటిస్తుందని ఇందులో తాను స్పందించాల్సిన అవసరం ఏం లేదన్నారు. ఆర్టీసీని 50 శాతం ప్రైవేటీకరణ చేస్తే సమస్యను కాస్త బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుందని దయాకర్ రావు అభిప్రాయపడ్డారు.

Also Read:5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

మున్సిపల్ ఎన్నికలపై ఒకటి రెండు చోట్ల మినహాయిస్తే రాష్ట్రమంతటా టీఆర్ఎస్ వైపే మొగ్గు ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వార్ వన్ సైడేనని.. 9 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ సొంతమవుతాయని దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. 

యూనియన్ల మాయలో పడి కుటుంబాల్ని చెడగొట్టుకోవద్దని నవంబర్ 5లోపు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

ఈ అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవేళ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5 వేల బస్సుల్ని కూడా ప్రైవేటుకిచ్చేస్తామని సీఎం హెచ్చరించారు.

ఈ అశకాశం కూడా చేజార్చకుంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ తెలిపారు. మీ కుటుంబాలను రోడ్డున పడనివ్వొద్దని.. ఫైనల్ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. మూడు రోజుల్లోగా ఉద్యోగంలోకి చేరి భవిష్యత్‌ను కాపాడుకోవాలన్నారు.

Also Read:వాళ్లేం చేసుకుంటే మాకేం: జగన్ ఆర్టీసీ విలీనం నిర్ణయంపై కేసీఆర్

ఐదో తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే మీకు టైమ్ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్ సమావేశంలో మొత్తం 49 మంది అంశాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందన్నారు.

ఆర్టీసీ కార్మికులు బాధ్యతారహితంగా సమ్మె చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వీలినం చేయకూడదని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని.. ఇది వ్యక్తి నిర్ణయం కాదని, కేబినెట్ నిర్ణయమని సీఎం తెలిపారు.

సుధీర్ఘంగా చర్చించే విలీనం సరికాదని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ 10,400 బస్సులు నడుపుతోందని.. ఆర్టీసీ బస్సుల్లో 2,100 బస్సులు ప్రైవేట్ వ్యక్తులవేనని.. మరో 3 వేల బస్సులకు కాలం చెల్లిపోయిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios