Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.

telangana government lecturers forum president madhusudan reddy arrest
Author
Hyderabad, First Published Oct 5, 2019, 4:57 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అనంతరం మధుసూదన్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మధుసూదన్ రెడ్డికి రిమాండ్ విధించింది. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మధుసూదన్ రెడ్డి నివాసాల్లో రెండు రోజులుగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. మధుసూదన్ రెడ్డి నివాసాలతోపాటు అతని బంధువుల నివాసాలు మెుత్తం 10 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. 

అయితే తక్కువ ధర చూపించి భారీగా ఇళ్లు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బినామీల పేర్లతో కూడా భారీగా ఆస్తులు కూడ బెట్టినట్లు సోదాల్లో తెలిసింది. సోదాల్లో మధుసూదన్ రెడ్డికి రూ.40 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 

మధుసూదన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాల నేథప్యంలో లెక్చరర్స్ బదిలీలు, ఇంటర్ పరీక్ష పేపర్ లీక్ వంటి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడి నివాసంలో ఏసీబీ సోదాలు: కీలక పత్రాలు స్వాధీనం

Follow Us:
Download App:
  • android
  • ios