Asianet News TeluguAsianet News Telugu

2014లో భారీ మెజారిటీ: గెలుపు కోసం చెమటోడుస్తున్న అభ్యర్థులు వీరే

2014 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఓట్లతో  విజయం సాధించిన అభ్యర్థులు  ఈ ధఫా తమ అదృష్టాన్ని  పరీక్షించుకొంటున్నారు. 

telangana elections: here is highest votes majority candidates in 2014 elections
Author
Hyderabad, First Published Dec 3, 2018, 11:53 AM IST


హైదరాబాద్:  2014 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఓట్లతో  విజయం సాధించిన అభ్యర్థులు  ఈ ధఫా తమ అదృష్టాన్ని  పరీక్షించుకొంటున్నారు. గత ఎన్నికల్లో 19 మందికి  40కు పైగా  ఓట్ల మెజారిటీ దక్కింది.  ఈ దఫా  ముగ్గురు పరిస్థితే ఆశాజనకంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో  అత్యధిక ఓట్ల మెజారిటీని సాధించిన కొందరు నేతలు  ఈ దఫా మాత్రం  తాము గెలిస్తే చాలనే  పరిస్థితులు నెలకొన్నాయి.  2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో   శేరిలింగంపల్లి నుండి  టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసిన అరికెపూడి  గాంధీ 76,257 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

ఈ స్థానం నుండి గత ఎన్నికల్లో  మువ్వ సత్యనారాయణ,అరికెపూడి గాంధీలు టీడీపీ టికెట్టు కోసం పోటీ పడ్డారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు  చొరవతో   అరికెపూడి గాంధీకి టికెట్టుకు దక్కింది.  ఆ ఎన్నికల సమయంలో  బీజేపీ, టీడీపీలు కూటమిగా పోటీ చేశారు. సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉంటాయి. 

దీంతో  గాంధీకి వన్ సైడ్‌ గా ఓట్లు పోలయ్యాయి.  జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఈ దఫా  సినీ నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ ను టీడీపీ శేరి లింగంపల్లి నుండి బరిలోకి దింపింది.  టీఆర్ఎస్ అభ్యర్ధిగా  అరికెపూడి గాంధీని బరిలోకి దింపింది.  

2014 ఎన్నికల సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తాటికొండ రాజయ్య 58,829 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇదే నియోజకవర్గానికి చెందిన  కడియం శ్రీహరి వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో  రాజయ్యకు భారీ మెజారిటీ వచ్చిందని  విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ, ఈ దఫా  రాజయ్యకు టికెట్టు ఇవ్వడాన్ని స్థానికంగా టీఆర్ఎస్ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. శ్రీహరి వర్గీయులు బహిరంగంగానే రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఈ పరిణామాల నేపథ్యంలో  కేటీఆర్, కేసీఆర్‌లు రాజయ్య అభ్యర్థిత్వాన్ని సమర్ధించారు. రాజయ్యకు మద్దతివ్వాలని  శ్రీహరికి టీఆర్ఎస్‌ ఆదేశించింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం నుండి  2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసిన బొడిగె శోభ 54,987 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.  ఈ దఫా టీఆర్ఎస్ టికెట్టు బొడిగె శోభకు టికెట్టు దక్కలేదు. దీంతో  శోభ బీజేపీలో  చేరారు. బీజేపీ అభ్యర్ధిగా ఆమె పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం,  టీఆర్ఎస్ అభ్యర్థి రవిశంకర్  మధ్య ప్రధానమైన  పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసిన  దుర్గం చిన్నయ్య 52,528 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ దఫా టీఆర్ఎస్‌ అభ్యర్థిగా చిన్నయ్య మరోసారి బరిలోకి దిగారు. ఈ దఫా పీపుల్స్ ఫ్రంట్ తరపున సీపీఐ నేత గుండా మల్లేష్ పోటీ చేస్తున్నారు.  టీఆర్ఎస్ నుండి చెన్నూరు టికెట్టు దక్కని కారణంగా  బీఎస్పీ అభ్యర్ధిగా  మాజీ మంత్రి వినోద్ ‌ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్‌లోని ఓ వర్గం మాజీ మంత్రి వినోద్‌‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిణామం చిన్నయ్యకు ఇబ్బందిగా మారింది.

చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుండి ఎంఐఎం అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీకి 59,274 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ దఫా మరోసారి ఇదే స్థానం నుండి అక్బరుద్దీన్ బరిలోకి దిగారు.  ఈ దఫా కాంగ్రెస్ పార్టీ నుండి  పహిల్వాన్ ఈసాబెన్ మిస్త్రీ, బీజేపీ నుండి సయ్యద్ షెహజారి బరిలో ఉన్నారు.

సిద్దిపేట నుండి గత ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన  హరీష్ రావు 93,328 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ దఫా టీజేఎస్ నుండి  భవానీ రెడ్డి, బీజేపీ నుండి సరోత్తం రెడ్డి  బరిలో ఉన్నారు. కానీ,   ఈ దఫా హరీష్ రావు  లక్ష ఓట్ల మెజారిటీ కోసం  ప్రయత్నాలు చేస్తున్నారు. 

2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లో చేరిన కొండా సురేఖ వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసి  55,085 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ దఫా ఈ స్థానంలో టీఆర్ఎస్ టికెట్టు కొండా సురేఖకు దక్కలేదు. దీంతో  ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి  పరకాల నుండి బరిలోకి దిగింది. గత ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే  ధర్మారెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.  ప్రస్తుతం కొండా సురేఖ కాంగ్రెస్ అభ్యర్థిగా, ధర్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుండి  గత ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన  పి. మనోహర్ రెడ్డి 62,677 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ దఫా మనోహర్ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ టికెట్టు దక్కని కారణంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన విజయరమణరావు  విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన  టీడీపీలో చేరారు.  గత ఏడాది విజయరమణరావు  టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయరమణరావు బరిలోకి దిగారు.

వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వినయ్ భాస్కర్  56,304 ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు. ఈ దఫా ఆయన మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.  ఈ దఫా ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి బరిలోకి దిగారు.ఈ దఫా వినయ్ భాస్కర్ ‌గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో  గత ఎన్నికల్లో  కేటీఆర్‌కు 53,004 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి బరిలో నిలిచారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన  ఆరూరి రమేష్ 86,863 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  ఈ దఫా మరోసారి రమేష్ బరిలోకి దిగారు. టీజేఎస్ నుండి పగిడిపాటి దేవయ్య, బీజేపీ నుండి  సారంగరావు బరిలోకి దిగారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హూజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  గత ఎన్నికల్లో బరిలో దిగిన ఈటల రాజేందర్  57,037 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  ఈ దఫా కాంగ్రెస్ పార్టీ కౌశిక్ రెడ్డిని బరిలోకి దించింది. 

గత ఎన్నికల్లో  బహదూర్ పురా నుండి  ఎంఐఎం అభ్యర్ధిగా బరిలోకి దిగిన  మౌజంఖాన్ కు95,045 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ దఫా అంత కంటే ఎక్కువ మెజారిటీని సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.


గత ఎన్నికల్లో భారీ మెజారిటీ పొందిన అభ్యర్థులు వీరే

1. అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి, అప్పుడు టీడీపీ అభ్యర్ధి)   76,257 మెజార్టీ
2. తాటికొండ రాజయ్య(స్టేషన్‌ఘన్‌పూర్, టీఆర్ఎస్)        58,829 మెజార్టీ
3.బొడిగె శోభ  (చొప్పదండి,  అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి)    54,987 ఓట్ల మెజార్టీ
4.దుర్గం చిన్నయ్య( బెల్లంపల్లి, టీఆర్ఎస్)        52,528 మెజార్టీ
5.హరీష్ రావు ( సిద్దిపేట, టీఆర్ఎస్)     93,328 మెజార్టీ
6. అక్బరుద్దీన్ ఓవైసీ(చాంద్రాయణగుట్ట,ఎంఐఎం)    59,274  మెజార్టీ
7.కొండా సురేఖ (వరంగల్ తూర్పు , అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి)  55,085 మెజార్టీ
8.పి. మనోహర్ రెడ్డి(పెద్దపల్లి, టీఆర్ఎస్)    62,677  మెజార్టీ
9.వినయ్ భాస్కర్( వరంగల్ పశ్చిమ, టీఆర్ఎస్)   56,304  మెజార్టీ
10. కేటీఆర్‌( సిరిసిల్ల, టీఆర్ఎస్) 53,004  మెజార్టీ
11.ఆరూరి రమేష్ వర్దన్నపేట, టీఆర్ఎస్)  86,863 మెజార్టీ
12.ఈటల రాజేందర్(హూజూరాబాద్, టీఆర్ఎస్)  57,037 మెజార్టీ
13.మౌజంఖాన్ ( బహదూర్ పురా, ఎంఐఎం) 95,045  మెజార్టీ

సంబంధిత వార్తలు

అప్పుడు బొటా బొటీ మెజారిటీతో విజేతలై నిలిచి.....

సూర్యాపేట కూటమి అభ్యర్థి దామోదర్ రెడ్డి 'సంచీ' సెంటిమెంట్

ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆ వాహనమే ఎందుకు వాడుతారంటే

అందరి దృష్టి కొడంగల్‌పైనే:ఆ ముగ్గురూ నాన్ లోకల్

రేవంత్ వర్సెస్ పట్నం: గుడికి, గడికి మధ్య పోటీ

సీఎం కుర్చీపై గురి: వ్యూహత్మకంగా రేవంత్ అడుగులు

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios