Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ఠ్రాల్లో ఆర్టీసీ విలీనం చిచ్చు: జగన్ కమిటీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీని విలీనం చేస్తామన్న అంశంపై సీఎం జగన్ కమిటీ వేశారే తప్ప ఆర్టీసీని విలీనం చేయలేదన్నారు. ఆ కమిటీలో ఎలాంటి మనుగడ లేదన్నారు. అదొక ఎక్స్ పరిమెంటల్ అంటూ చెప్పుకొచ్చారు. 

telangana cm kcr satirical comments on ap cm ys jagan over RTC Merging
Author
Hyderabad, First Published Oct 24, 2019, 5:52 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ విలీనం కాలేదన్నారు. ఆర్డర్ తీశాడు కమిటీ వేశారంటూ సెటైర్లు వేశారు. 

ఆర్టీసీని విలీనం చేస్తామన్న అంశంపై సీఎం జగన్ కమిటీ వేశారే తప్ప ఆర్టీసీని విలీనం చేయలేదన్నారు. ఆ కమిటీలో ఎలాంటి మనుగడ లేదన్నారు. అదొక ఎక్స్ పరిమెంటల్ అంటూ చెప్పుకొచ్చారు. విలీనం చేసే ప్రతిపాదనను తీసుకువచ్చారని చెప్పుకొచ్చారు. 

ఇటీవలే ఆర్టీసీ విలీనంకు సంబంధించి సాధ్య అసాధ్యాలపై ఆ కమిటీ నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. మూడు నెలలు తర్వాత ఆ కమిటీ కథేంటో చెప్తానని జగన్ చెప్పుకొచ్చారని కేసీఆర్ స్పష్టం చేశారు. 

అది ఏమై పోయిందో దేవుడుకే ఎరుక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. జగన్ హామీ ఇచ్చారని దానికి ఆర్డర్ ఇచ్చారు కమిటీ నియమించారని ప్రస్తుతం అధ్యయనంలో ఉందన్నారు కేసీఆర్. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది అసాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ భూమి ఉన్నంతకాలం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమన్నారు. ఆర్టీసీ నష్టాలను భరించడం ఎవరి వల్లా సాధ్యం కాదన్నారు కేసీఆర్. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఏపీ సీఎం జగన్ నిర్ణయంపై కూడా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దానిపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios