Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ ఎన్నికల ఆలస్యానికి స్వప్నారెడ్డే కారణం...: కేసీఆర్

గతంలో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలే ఇప్పుడు వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాయంటూ కాంగ్రెస్, టిడిపి పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.  అసలు పంచాయితీ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు తగ్గడానికి సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులే కారణమంటూ మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకులు బిసి రిజర్వేషన్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లడం... కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

telangana cm kcr fires on congress leaders
Author
Hyderabad, First Published Dec 29, 2018, 7:26 PM IST

గతంలో బిసిలకు అన్యాయం చేసిన పార్టీలే ఇప్పుడు వారిపై ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నాయంటూ కాంగ్రెస్, టిడిపి పార్టీలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు.  అసలు పంచాయితీ ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు తగ్గడానికి సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులే కారణమంటూ మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకులు బిసి రిజర్వేషన్లు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లడం... కోర్టు రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని తీర్పు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడేదో బిసిలకు  న్యాయం చేయడానికి పోరాడుతున్నట్లు అదే పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. 

కొత్త పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం బిసిల రిజర్వేషన్ ను 34 శాతానికి, మొత్తం రిజర్వేషన్లను 61.19 శాతానికి పెంచామని కేసీఆర్ గుర్తుచేశారు. ఇలా బీసీలకు అత్యధిక రిజర్వేషన్ ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే... బీసీలకు రిజర్వేషన్లు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లినట్లు ఆరోపించారు.    

 రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ స్వప్నారెడ్డి, సర్పంచ్ సంఘం నాయకుడు భూపాల్ రెడ్డిలు రిజర్వేషన్లు 50 శాతం మించరాదంటూ హైకోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు 61.19 రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఇలా హైకోర్టుకు వెళ్లిన ఇద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే నంటూ కేసీఆర్ వెల్లడించారు. 

తమకు బిసి రిజర్వేషన్లు పెంచాలని చిత్తశుద్ది ఉంది కాబట్టే హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేశామన్నారు. తాము రిజర్వేషన్లు 61 శాతానికి పెంచుకుంటామంటే సుప్రీం కోర్టు కూడా 50 శాతానికి దాటరాదని తీర్పు ఇచ్చిందన్నారు. అందువల్ల కోర్టుల తీర్పును ధిక్కరించకూడదు కాబట్టే రిజర్వేషన్లను 50 శాతానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాల్సి వచ్చిందని కేసీఆర్ తెలిపారు. 

గతంలో పాలించిన పార్టీల కంటే మెరుగ్గా తమ ప్రభుత్వం బిసిలకు న్యాయం చేసిందని కేసీఆర్ అన్నారు. ఈ సోకాల్డ్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బీసీలను అణగదొక్కాయని ఆరోపించారు. తామ పాలనలో బీసీల హాస్టల్స్ పెంచామని, బీసీలకు పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇచ్చినట్లు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేనేత కార్మికులను ఆదుకున్నామని, నాయి బ్రహ్మణులను ఆదుకున్నామన్నారు.  

సీఎం తర్వాత రెండు ప్రోటోకాల్స్ ఉంటాయని అవి స్పీకర్, శాసనమండలి చైర్మన్ పదవులు అని అవి రెండు బీసీలకే కట్టబెట్టామన్నారు. అలాగే విప్ లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్ గా బిసిలకు అవకాశాలు కల్పించినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios