Asianet News TeluguAsianet News Telugu

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ, టీడీపీ పోటీకి సిద్దమయ్యాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

tdp shocks to congress in huzurnagar bypoll,war words between trs and congress
Author
Hyderabad, First Published Sep 29, 2019, 9:12 AM IST

హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన జరగనున్న ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయాలను వేడేక్కించాయి. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కూడ తమ అభ్యర్ధులను రంగంలోకి దించుతున్నాయి.రాజకీయంగా తమపై ఒంటికాలిపై లేస్తున్న మాజీ ఎంపీ వివేక్ ను హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓడించడం ద్వారా ఈ వారం టీఆర్ఎస్ బీజేపీపై పైచేయి సాధించింది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో  విజయం సాధించాలని టీఆర్ఎస్, ఈ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ మేరకు ఈ రెండు పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

మండలానికి ఎంపీ, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఇంఛార్జీలుగా నియమించింది. అంతే కాదు పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించింది టీఆర్ఎస్. వారం రోజుల క్రితం హుజూర్‌నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ట్రక్కు గుర్తు లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికల్లోనే ఓటమి పాలయ్యేవాడని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఉత్తమ్ పై కూడ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ కేటీఆర్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కూడ విరుచుకుపడ్డారు.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైతే ఉత్తమ్ రాజకీయ సన్యాసం చేస్తారా అంటూ టీఆర్ఎస్ సవాల్ విసిరింది. ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం సాగుతోంది. తమ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్ లో చేరాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడ ఉత్తమ్ టీఆర్ఎస్ పై ఆరోపణలు సంధించారు.

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో అభివృద్ధి పనుల కోసం ఎలాంటి నిధులను మంజూరు చేయలేదని ఉత్తమ్ గుర్తు చేశారు.

ఇక మరోవైపు తమ పార్టీకి ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో టీడీపీ కాంగ్రెస్ కు మద్దతును ప్రకటించింది.కానీ, ఈ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనుంది. సెప్టెంబర్ 29వ తేదీన అభ్యర్ధిని టీడీపీ ప్రకటించనుంది.

ఇక బీజేపీ కూడ ఈ స్థానంలో పోటీకి దిగుతోంది. ఈ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం పెరిక. ఈ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కోట రామారావును బీజేపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో బీజేపీకి 1551 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు మాత్రం 1600కు పైగా ఓట్లు వచ్చాయి.అయితే పెరిక సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రామారావును బరిలోకి దింపడం ద్వారా గణనీయమైన ఓట్లను సాధిస్తామని ఆ పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. 

ఇక సీపీఐ, తెలంగాణ జనసమితి, జనసేనలు తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. జనసేన, సీపీఐ నేతలతో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు.ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు

ఇదిలా ఉంటే హె‌చ్‌సీఏ ఎన్నికల్లో మాజీ ఎంపీ వివేక్  ఓటమి పాలయ్యాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మాద్ అజారుద్దీన్ హెచ్‌సీఏ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. అజారుద్దీన్ కు టీఆర్ఎస్ మద్దతుగా నిలిచింది. వివేక్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. వివేక్ బీజేపీలో చేరిన తర్వాత హెచ్‌సీఏ ఎన్నికల్లో వివేక్ ఓటమి పాలయ్యారు.

ఈ ఎన్నికల్లో అజారుద్దీన్ కు టీఆర్ఎస్ అండగా నిలిచింది. అయితే అజారుద్దీన్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది.ఈ కారణంగానే అజారుద్దీన్ కు టీఆర్ఎస్ హెచ్ సీ ఏ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిందనే ప్రచారం కూడ లేకపోలేదు. 

పార్టీ మార్పుపై ఇప్పుడే  ఏం చెప్పలేనని అజారుద్దీన్ శుక్రవారం నాడు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏం జరుగుతోందో చెప్పలేనన్నారు. హెచ్ సీ ఏ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కలవనున్నట్టుగా అజారుద్దీన్ చెప్పారు. శనివారం నాడు అజారుద్దీన్ కేటీఆర్ తో భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు:

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios