Asianet News TeluguAsianet News Telugu

‘‘ఆంధ్రోళ్లు..తెలంగాణలో అడుగుపెట్టొద్దు’’

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య ఉద్యోగాల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. 

t genco cmd prabhakar rao says.. andhra pradesh people dont come telangana for job
Author
Hyderabad, First Published Feb 14, 2019, 11:44 AM IST

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్తు సంస్థల మధ్య ఉద్యోగాల విషయంలో నెలకొన్న వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. చాలా మంది ఏపీ వాళ్లు.. తెలంగాణలో ఎప్పటి నుంచో స్థిరపడి ఉన్నారు. దీంతో.. ఇక్కడే తమ ఉద్యోగాలు ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారు. అయితే.. దీనిపై తెలంగాణ వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు.

స్థానికత ఆధారంగానే ఉద్యోగాలు ఉండాలని తెలంగాణ ఇంధన సంస్థలు వాదిస్తుంటే .. అర్హత ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ వాదిస్తోంది. తెలంగాణ నుంచి రిలీవ్‌ చేసిన 1,153 మంది ఇంజనీరింగ్‌ అధికారులకే ఆప్షన్‌ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఇంధన సంస్థలు వాదిస్తుంటే .. తెలుగు రాష్ట్రాల్లోని ఇంధన సంస్థల ఇంజనీరింగ్‌ అధికారులందరికీ ఆప్షన్లు ఉండాలని ఏపీ ఇంధన సంస్థలు వాదిస్తున్నాయి.

 ఈ అంశంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ మంగళ, బుధవారాల్లో విజయవాడలో రాష్ట్ర విద్యుత్తు సంస్థల ఇంజనీరింగ్‌ అధికారుల అభిప్రాయాలను సేకరించింది.

‘తెలంగాణలో సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంది. ఆంధ్రా ప్రాంతంవారు తెలంగాణను ఎంపిక చేసుకోవద్దు. అందరూ హైదరాబాద్‌ను చూసి అక్కడకి వచ్చేద్దామనుకుంటున్నారు. కానీ, ఉద్యోగులందరినీ హైదరాబాద్‌లోనే పోస్టింగ్‌ ఇవ్వాలన్న నిబంధనేమీలేదు. తెలంగాణ జిల్లాలకూ పంపించొచ్చు. మా జిల్లాల్లో సెంటిమెంట్‌ ఎక్కువగా ఉంది. అక్కడ ఉద్యోగం చేయడం ఆంధ్రా ప్రాంతంవారికి కష్టమే. స్థానికత ఆధారంగానే ఉద్యోగాలు ఉండాలి. ఆంధ్రా ప్రాంతంవారు తెలంగాణ ఆప్షన్‌ను కోరుకోవద్దు.’’అని తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios