Asianet News TeluguAsianet News Telugu

సర్వే: 22 మంది సిఎంల్లో కేసీఆర్ టాప్, 14వ స్థానంలో చంద్రబాబు

కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 20,827 మంది ఓటింగులో పాల్గొనగా 68.3 శాతం మంది కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

Survey: KCR best among 22 Chief Ministers
Author
Hyderabad, First Published Mar 23, 2019, 10:34 AM IST

హైదరాబాద్‌: దేశంలోని 22 మంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అగ్రస్థానంలో నిలిచారు. సివోటర్స్ - ఐఎఎఎన్ఎస్ నిర్వహించిన సర్వేలో ఓటర్లు కేసీఆర్ కు రేటింగ్ లో అగ్రస్థానం కట్టబెట్టారు. 

ఆ తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థి అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ స్థానంలో నిలిచారు. 

తెలంగాణ రాష్ట్రంలో 20,827 మంది ఓటింగులో పాల్గొనగా 68.3 శాతం మంది కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 28.8 శాతం మంది ఫరవా లేదన్నారు. 9.9 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో 19,900 మంది ఓటింగులో పాల్గొనగా తాము చంద్రబాబు పాలనతో సంతృప్తి చెందుతున్నట్లు 41.7 శాత మంది చెప్పారు. 28.2 శాతం మంది ఫరవాలేదని చెప్పారు .28.6 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి పలనిస్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి టీఎస్ రావత్ రేటింగ్ లో దిగువ స్థాయిలో నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పాలన పట్ల 42 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరే  ఉన్నారు. అందులోనూ ఒకరు మాత్రమే టాప్-3లో చోటు సంపాదించుకోగా.. పదో స్థానంలో అసోం సీఎం శర్బానంద సోనోవాల్ నిలిచారు. 

ఐదోస్థానంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్‌బఘేల్, ఆరోస్థానంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఏడోస్థానంలో కర్ణాటక సీఎం కుమారస్వామి, తొమ్మిదోస్థానంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios