Asianet News TeluguAsianet News Telugu

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం మందు విద్యార్థుల తల్లీదండ్రులు ఆందోళనకు దిగారు.

students and their parents protest at telangana inter board
Author
Hyderabad, First Published Apr 20, 2019, 1:18 PM IST

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యాలయం మందు విద్యార్థుల తల్లీదండ్రులు ఆందోళనకు దిగారు. బోర్డు ప్రకటించిన ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా ఉండటంతో పాటు మార్కుల్లో ఏపీ, ఏఫ్ లెటర్లు దేనికి సంకేతం అన్నది అర్థం కాక విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.

దీంతో వారి పేరేంట్స్ నాంపల్లిలోని ఇంటర్ కార్యాలయం ముందు శనివారం ధర్నాకు దిగారు. పేపర్లు దిద్దకుండానే ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ వారు బోర్డుపై భగ్గుమంటున్నారు. 

సుమారు 500 మంది విద్యార్థులకు ప్రాక్టీకల్స్‌లో మార్కులు లభించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సెక్రటరీ అశోక్‌ను ఘెరావ్ చేసిన తల్లిదండ్రులు.. చనిపోయిన 16 మంది పిల్లల మరణాలకు బాధ్యత వహించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ విధానం ఉందని అశోక్ పేర్కొన్నారు. 

మరోవైపు పీఆర్‌వో వ్యవహారశైలిపైనా పేరేంట్స్ మండిపడుతున్నారు. తమ పిల్లలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తే చూస్తాం, చేస్తాం అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరు విద్యార్థులు ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిందని అధికారులను కలిసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. దీంతో ఇంటర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios