Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ: రాజయ్యకు వ్యతిరేకత, కడియం కూతురు కోసమేనా?

స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యను మార్చాలని  స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు

station ghanpur trs leaders meets minister ktr in hyderabad
Author
Hyderabad, First Published Oct 1, 2018, 1:23 PM IST


హైదరాబాద్: స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యను మార్చాలని  స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం నాడు స్టేషన్‌ఘన్‌పూర్‌‌కు చెందిన  కడియం శ్రీహరి, రాజయ్య వర్గాలు  కేటీఆర్‌తో సమావేశమయ్యారు.స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాజయ్యను తాము  ఒప్పుకొనేది లేదని స్థానిక నేతలు స్పష్టం చేశారు. రాజయ్యకు బదులుగా  మరో  వ్యక్తిని బరిలోకి దింపాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  మాజీ మంత్రి రాజయ్య పేరును సెప్టెంబర్ 6 వ తేదీన  రాజయ్య పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే రాజయ్యకు బదులుగా మరోకరిని ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని  స్థానిక నేతలు కోరుతున్నారు.

ఈ మేరకు స్టేషన్‌ఘన్‌పూర్ నుండి కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని కూడ కొందరు నేతలు కడియం ఇంటి వద్ద ఆందోళన కూడ నిర్వహించారు. 
ఈ తరుణంలోనే  రాజయ్య  ఓ మహిళతో  మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ తరుణంలో  అభ్యర్థిని మార్చాలని  కూడ డిమాండ్ సాగుతోంది. 

ఈ తరుణంలోనే  సోమవారం నాడు  స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన నేతలు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. రాజయ్యకు బదులుగా మరోకరిని ఈ స్థానం నుండి  బరిలోకి దింపాలని స్థానిక నేతలు కోరుతున్నారు.

రాజయ్యకు బదులుగా  మరోకరిని  ఈ స్థానం నుండి నిలిపితేనే పార్టీకి ప్రయోజనమని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.  రాజయ్య అభ్యర్థిగా ఉంటే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. రాజయ్యకు బదులుగా పార్టీ మరో అభ్యర్థి కోసం చూస్తే  కడియం కుటుంబానికి టిక్కెట్టు దక్కుతోందా.. లేదా స్థానికంగా ఉన్న ఇతరులకు టిక్కెట్టు కేటాయిస్తారా అనే చర్చ కూడ సాగుతోంది

రాజయ్య అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక నేతలు కేటీఆర్ వద్దకు రావడం  రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. తన కూతురు కావ్యను  బరిలోకి దింపాలనే  యోచనలో కడియం కూడ ఉన్నారనే  ప్రచారం కూడ అప్పట్లో సాగింది. కానీ, కడియం కుటుంబానికి టిక్కెట్టు దక్కలేదు.

దీంతో స్టేషన్‌ఘన్‌నపూర్‌లో ప్రస్తుతం చోటు చేసుకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా కడియం మార్చుకొన్నారని రాజయ్య వర్గీయులు  కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఈ పరిణామాల నేపథ్యంలో  పార్టీ అభ్యర్థిని  టీఆర్ఎస్ మార్చే అవకాశం ఉంటుందా.. కొత్త అభ్యర్థిని బరిలోకి దింపుతారా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

కనిపించకుండా పోయిన.. రాజయ్య ‘‘కొంటెపులి..చిలిపి పిల్ల’’..?

"కొంటెపులివి, చిలిపి పిల్లవి"... ఫోన్లో రాజయ్య రాసలీలలు.. మహిళతో అసభ్య సంభాషణ

కడియంకు రాజయ్య పాదాభివందనం.. ఎన్నికల్లో సహకరించాలని విన్నపం

రాజయ్యకి షాక్.. పెల్లుబుక్కుతున్న అసమ్మతి

మళ్లీ బోరున ఏడ్చేసిన రాజయ్య

 

Follow Us:
Download App:
  • android
  • ios