Asianet News TeluguAsianet News Telugu

సండ్ర, మచ్చాలకు టీఆర్ఎస్ గాలం: పార్టీ మార్పుపై తేల్చేసిన ఎమ్మెల్యేలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడ టీఆర్ఎస్ వల వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. 

sandra venkata veeraiah secret meeting with party workers in khammam
Author
Khammam, First Published Dec 22, 2018, 9:44 AM IST


హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడ టీఆర్ఎస్ వల వేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావును టీఆర్ఎస్ లో చేరాలని ఆ పార్టీ నేతలు రాయబారం నడుపుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేతలతో సండ్ర వెంకటవీరయ్య సమావేశమై ఈ విషయమై చర్చించినట్టుగా సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ 13 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది.ఈ రెండు స్థానాలు కూడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనివే. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మూడో సారి ఈ స్థానం నుండి విజయం సాధించారు. ఆశ్వరావుపేట నుండి మచ్చా నాగేశ్వర్ రావు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే  టీఆర్ఎస్ నేతలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేత ఒకరు  సండ్ర వెంకటవీరయ్యతో పాటు మచ్చా నాగేశ్వర్ రావుతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ నుండి వచ్చిన ఆఫర్ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్యులతో సండ్ర వెంకటవీరయ్య భేటీ అయ్యారని సమాచారం. టీఆర్ఎస్ నుండి ఆఫర్ వచ్చిన విషయాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

ఈ సమావేశానికి ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు కూడ హాజరయ్యారు. టీఆర్ఎస్ నుండి వచ్చిన ఆఫర్ గురించి సండ్ర మచ్చా నాగేశ్వర్ రావుతో చెప్పినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే తాను పార్టీ మారుతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు.మరో వైపు  మచ్చా నాగేశ్వర్ రావు కూడ తాను పార్టీ మారేది లేదని ప్రకటించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన సమయంలో కూడ సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరలేదు.

తుమ్మలతో విబేధించి టీడీపీలోనే కొనసాగారు. సత్తుపల్లిలో టీఆర్ఎస్ గెలవాల్సిందేనని తుమ్మల కార్యకర్తల సమావేశంలో గట్టిగా చెప్పారు. కానీ, ఈ స్థానంలో టీడీపీ విజయం సాధించింది.

టీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోనే తక్కువ సీట్లు వచ్చాయి. తుమ్మల నాగేశ్వర్ రావు కూడ ఓటమి పాలయ్యారు. ప్రజా కూటమికి ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు దక్కాయి. దరిమిలా విపక్షాలకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇందులో భాగంగానే  సండ్ర మచ్చాలతో రాయబారాలు నడుపుతున్నారనే ప్రచారం సాగుతోంది.

సంబంధిత వార్తలు

కేసీఆర్ దెబ్బ: నాడు టీడీపీ, నేడు కాంగ్రెస్ విల విల

రంగంలోకి ఉత్తమ్: ఆ నలుగురిపై వేటుకు కాంగ్రెస్ డిమాండ్

కేసీఆర్ షాక్: మండలిలో కాంగ్రెస్ఎల్పీ టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం

‘ఏపీలో స్పీకర్, ఛైర్మన్ చట్టాన్ని కాపాడుతున్నారు.. కానీ తెలంగాణలో’’

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ శాసనమండలి ఎల్‌పీ వీలీనం..?

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం

పార్టీ అన్యాయం చేయలేదు.. బాబు ప్రచారం నచ్చలేదు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు

సీఎల్పీ మీటింగ్ జరగలేదు.. ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసు: ఉత్తమ్

 

Follow Us:
Download App:
  • android
  • ios