Asianet News TeluguAsianet News Telugu

RTC Strike 31వ రోజు: ఆగిన మరో గుండె, దేవరకొండ బంద్ కు జేఏసీ పిలుపు

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లా దేరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డి ఈ తెల్లవారుజామున గుండె పోటుతో ప్రాణాలొదిలారు.  

RTC Strike: rtc driver died dueto heart attack, jac call for bandh
Author
Hyderabad, First Published Nov 4, 2019, 9:57 AM IST

నల్గొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన అజెండాగా 31వ రోజులకు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం కార్మికులను విధుల్లో చేరాలని, ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని చెప్తుండగా....కార్మికులు పట్టుసడలకుండా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. 

ఈనెల 5 అర్థరాత్రి లోపు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పట్టించుకోకుండా సమ్మెను ఉధృతం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.   ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మరో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. 

నల్గొండ జిల్లా దేరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డి ఈ తెల్లవారుజామున గుండె పోటుతో ప్రాణాలొదిలారు. స్వగ్రామం నాంపల్లి మండలంలోని లింగపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో కుప్పకూలాడు.

గుండెపోటుకు గురవ్వడంతో జైపాల్‌రెడ్డిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. జైపాల్ యాదవ్.  

జైపాల్ యాదవ్ మృతదేహంతో దేవరకొండ బస్సు డిపో వద్దకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. జైపాల్ యాదవ్ మృతదేహాన్ని చూసిన ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో డిపో వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జైపాల్ యాదవ్ మృతిపై ఆర్టీసీ జేఏసీ విచారం వ్యక్తం చేసింది. డ్రైవర్ జైపాల్ రెడ్డి మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి మృతికి నిరసనగా దేవరకొండ బంద్ కు పిలుపు ఇచ్చారు ఆర్టీసీ జేఏసీ. 
 

ఈ వార్తలు కూడా చదవండి

Rtc Strike:దేవరకొండ డిపో డ్రైవర్ టీజేరెడ్డి మృతి

RTC Strike:విధుల్లో చేరుతున్న కార్మికులు, కారణాలివే

Follow Us:
Download App:
  • android
  • ios