Asianet News TeluguAsianet News Telugu

RTC strike: సీఎస్ కు ఆర్టీసీ ఎండీ కి జాతీయ బీసీ కమీషన్ నోటీసులు

ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో  పేర్కొన్నారు.  
 
rtc strike: national bc commission serves notices to telangana cs and rtc md
Author
New Delhi, First Published Oct 19, 2019, 4:01 PM IST

ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో  పేర్కొన్నారు.  

ఆర్టీసీలో 20 వేల పైచిలుకుమంది బీసీ కార్మికులుంటారని, ప్రభుత్వం ఇలా డిస్మిస్, సెల్ఫ్ డిస్మిస్ వంటి వింత విపరీత చేష్టలతో వారితోపాటు వారి కుటుంబాలు రోడ్డునపడుతాయని ఆర్టీసీ జేఏసీ తమ ఫిర్యాదులో పేర్కొంది. 

వీరి ఫిర్యాదును అందుకున్న జాతీయ బీసీ కమిషన్ అత్యవసరంగా పరిగణించాల్సిన కేసు కింద పేర్కొంటూ బీసీ కమిషన్ సభ్యుడైన టి. ఆచారి స్పందించారు. 

ప్రభుత్వ విధానాలను ఏ ప్రాతిపదికన తీసుకున్నరో వచ్చి వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఇటు తెలంగాణ సీఎస్ కు అటు ఆర్టీసీ ఎండికి నోటీసులు జారీ చేసింది. 

ఈ నెల 25న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో కమిషన్ ముందు పూర్తి నివేదికతో హాజరు కావాలని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios