Asianet News TeluguAsianet News Telugu

ఆర్టీసీ సమ్మె: జీతాల్లేవ్, వెనక్కి తగ్గని సీఎం కేసీఆర్

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని ప్రకటించిన కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. విధులు నిర్వర్తించిన వారికే జీతాలు ఉంటాయని లేని వారికి జీతాలు ఎందుకు అంటూ నిలదీశారు. 
 

rtc strike effect: telangana cm kcr is a non-recoverable
Author
Hyderabad, First Published Oct 12, 2019, 4:24 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు వర్సెస్ తెలంగాలణ ప్రభుత్వంగా సీన్ మారిపోయింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరుబాట ఆపేది లేదని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్తుంటే అసలు సమ్మెను ఎట్టిపరిస్థితుల్లో గుర్తించబోమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పేస్తున్నారు.  

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని ప్రకటించిన కేసీఆర్ తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. విధులు నిర్వర్తించిన వారికే జీతాలు ఉంటాయని లేని వారికి జీతాలు ఎందుకు అంటూ నిలదీశారు. 

అంతేకాదు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం గుర్తించదని తేల్చి చెప్పారు. అలాగే సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులతో చర్చించే ప్రసక్తి కూడా ఉండదన్నారు కేసీఆర్. 

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సులు రోడ్డుపై తిరగాల్సిందేనని అధికారులను ఆదేశించారు. అన్ని బస్సులు రోడ్డుమీదకు వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం అనుసరించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

రైల్వేను ప్రైవేటీకరిస్తారు గానీ ఆర్టీసీని విలీనం చేయమంటారా...? : బీజేపీని నిలదీసిన కేసీఆర్ 
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన బీజేపీ రైల్వే ప్రైవేటీకరణపై ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు సీఎం కేసీఆర్. చివరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రైవేటీకరించిందంటూ మండిపడ్డారు. అసలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారో చెప్పాలని నిలదీశారు. 

చట్ట విరుద్ధమైన సమ్మెకు రాష్ట్రంలో విపక్షాలు మద్దతు పలకడం అనైతికమంటూ కేసీఆర్ అభిప్రాయపడ్డారు. యూనియన్ నేతల అత్యుత్సాహం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

యూనియన్ నేతల నిర్ణయాలను నమ్మి 48వేల మంది కార్మికులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సమ్మెను ఎట్టిపరిస్థితుల్లో తాము గుర్తించేది లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. 

ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నా, ప్రజలను అడ్డుకున్నా ప్రభుత్వం సహించదని తేల్చి చెప్పారు. యూనియన్ నేతల బెదిరింపులకు తమ ప్రభుత్వం బెదిరిపోయే ప్రసక్తే లేదన్నారు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

అద్దెబస్సుల కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని బస్ డిపోల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు సీఎం కేసీఆర్. 

Follow Us:
Download App:
  • android
  • ios