Asianet News TeluguAsianet News Telugu

rtc strike: కేసీఆర్ ప్రభుత్వంపై ఆశ్వాత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

RTc Jac convenor ashwthama reddy makes sensational comments
Author
Hyderabad, First Published Oct 17, 2019, 4:12 PM IST

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని  ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం నాడు ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. తన టెలిఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం అవుతోందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి  సమ్మె చేస్తున్నారు.  సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఈ  నెల 6వ తేదీలోపుగా విదుల్లో చేరని వారంతా సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ఈ వార్తలు చదవండి

ఆర్టీసీ సమ్మె: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు భేటీ

కేశవరావు ప్రకటనపై తీవ్ర అసంతృప్తి: కేసీఆర్ షాక్

వెనక్కి తగ్గని కేసీఆర్: తమిళిసై చేతిలో అస్త్రం, వ్యూహాత్మకంగా కాంగ్రెస్

సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. బుధవారం నాడు సుధీర్ఘంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు కూడ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎష్ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేశవరావుతో భేటీ అయ్యారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని కేశవరావు కోరారు. ప్రభుత్వానికి తమకు మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని కేశవరావును ఆర్టీసీ జేఎసీ కన్వీనర్  ఆశ్వత్థామరెడ్డి   ఈ నెల 14 వ తేదీన  కోరారు. చర్చలకు కేశవరావు కూడ సానుకూలంగా సంకేతాలు పంపారు.

కానీ, ప్రభుత్వం నుండి సానుకూలంగా సంకేతాలు రాలేదు. రెండు రోజుల నుండి సీఎం అపాయింట్ మెంట్ కోసం కేశవరావు ప్రయత్నిస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ గురువారం నాడు దొరికింది. 

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు అక్టోబర్ 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ను విజయవంతం చేయాలని వారం రోజులుగా జేఎసీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

తమ సమ్మెకు ఆర్టీసీ కార్మికులు ఇతర ఉద్యోగ సంఘాలను కూడగడుతున్నాయి. టీఎన్‌జీవో నేతలు కూడ  తెలంగాణ సమ్మెకు మద్దతును ప్రకటించారు. రెవిన్యూ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడ ఆర్టీసీ సమ్మెకు మద్దతును ప్రకటించారు.

త్వరలోనే విద్యుత్ ఉద్యోగులు కూడ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సమ్మె చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా టీఆర్ఎస్ కు నష్టం చేసే అవకాశాలు ఉండే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్టీసీసమ్మె విషయంలో టీఆర్ఎస్ లో కొందరు మంత్రులు మాట్లాడి మరికొందరు నోరు మెదపకపోవడంపై కూడ జేఎసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు గతంలో హరీష్ రావు గౌరవాధ్యక్షుడుగా ఉన్నాడు. అయితే  ఎన్నికలకు ముందు హరీష్ రావు ఈ పదవికి రాజీనామా చేశారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో హరీష్ రావు మాత్రం నోరు మెదపడం లేదు. విపక్షాలు ఈ విషయంలో హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఎందుకు నోరు మెదపడం లేదని  ప్రశ్నిస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios