Asianet News TeluguAsianet News Telugu

మొగోడివైతే రా, చూసుకుందాం: కేటీఆర్ పై రేవంత్ తిట్ల వర్షం

కొడంగల్‌లో కేసీఆర్ అరాచకాలకు పాల్పడుతున్నారని  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

revanth reddy slams on kcr in kodangal
Author
Kodangal, First Published Dec 4, 2018, 6:09 PM IST

 

కొడంగల్: . తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.. వ్యక్తిగత విమర్శలకు దిగారు. అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర పరిణామాలపై చర్చకు రావాలని కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  కొడంగల్‌కు చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రెడీ... రేపు సాయంత్రం వరకు టైమ్ ఉంది. కొడంగల్ గురించా,, రాష్ట్రం గురించా, నీచమైన నీ కుటుంబం గురించా చర్చిద్దామా  అంటూ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

కేటీఆర్‌పై పరుషమైన పదజాలంతో  రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.  .  బిడ్డా.. కేటీఆర్ నీకు నెల రోజుల టైమిస్తున్నా నీ సంగతి చెబుతా అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నీవు  మొగోడివా.. అంటూ కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దుబాయ్‌లో నీవు తల మీద జుట్టు పెంచుకొని వచ్చినట్టుగా మూతి మీద మీసం పెంచుకొని వచ్చేందుకు నెల రోజుల పాటు టైమిస్తున్నా అంటూ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

చుట్టూ సినిమాల వాళ్లు ఉంటారని  భారీ డైలాగులు కొట్టొద్దన్నారు. నీకు నెల రోజుల పాటు సమయమిస్తున్నా... నీ సంగతి చెబుతాను అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు.   

మొదట నీ అల్లుడు, ఆ తర్వాత నీ కొడుకు వచ్చారు ఇవాళ నీవు వచ్చావు...  మీ ముగ్గురు కూడ రేపు కలిసి రావాలని   రేవంత్ రెడ్డి  సవాల్ విసిరారు. రేపు  ముగ్గురు కలిసి మూటలతో, ముఠాలతో కలిసి రావాలని రేవంత్ రెడ్డి కోరారు..అంబేద్కర్ చౌరస్తా వద్ద గిరి గీసుకొని తేల్చుకొందాం రండి అంటూ సవాల్ విసిరారు.

కొడంగల్ నియోజకవర్గంలో  టీఆర్ఎస్ ను గెలిపించుకొనేందుకు గాను  డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటలిజెన్స్  పోలీసు అధికారి ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

కొత్తగా నియామకమైన పోలీస్ కానిస్టేబుళ్లను  గ్రామంలో మఫ్టీల్లో నియమించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రేవంత్ రెడ్డి  చెప్పారు.
పోలీసులు, రౌడీ మూకల అండతో  కొడంగల్ ప్రజలపై  కేసీఆర్ యుద్దాన్ని ప్రకటించారని  రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి కాదు రెండు లక్షల కొడంగల్ ప్రజల మీద జరిగిన దాడిగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

టీఆర్ఎస్ అభ్యర్థి నరేంద‌ర్ రెడ్డితో పాటు  ఆయన బంధువుల ఇంట్లో  దొరికిన డబ్బుల విషయంలో ఐటీ అధికారులు పోలీసులకు వివరాలు ఇస్తే  ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని  రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై తాను వ్యక్తిగతంగా రజత్‌కుమార్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 

నియంత పాలనలో  కూడ ఇంత అరాచకాన్ని చూడలేదన్నారు.అరాచకాలు సృష్టించి కొడంగల్ లో గెలవాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కోర్టులో కేసు విచారణను పురస్కరించుకొని ఏం సమాధానం చెప్పాల్సి వస్తోందనే భయంతో  తనతో బాండ్ పేపర్ పై సంతకం పెట్టించుకొని  విడుదల చేశారన్నారు.

ఏ క్షణమైనా దాడులు  చేసే అవకాశం ఉందని  తనకు కచ్చితమైన సమాచారం ఉందన్నారు. తన రక్షణ విషయంలో  తనకు ఎలాంటి భయం లేదన్నారు. వేలాది మంది కార్యకర్తలు తనకు రక్షణగా ఉన్నారని చెప్పారు. 

వేలాది మంది ప్రైవేట్ సైన్యం తెచ్చుకొన్నా కూడ  కొడంగల్  ప్రజలు  అండగా ఉన్నంత కాలం కేసీఆర్ తనను  ఏం చేయలేరన్నారు.అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రేవంత్  కోరారు. మండలాలవారీగా అధికారుల వివరాలను డైరీల్లో రాయాలని  ఆయన  కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే  ఈ అధికారులను శంకరగిరీ మాన్యాలకు పంపుతామని రేవంత్ రెడ్డి  హెచ్చరించారు.

కొడంగల్‌లో కేసీఆర్ అరాచకాలకు పాల్పడుతున్నారని  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా  కేసీఆర్ పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్  ఎంపీగా  ఎన్నిక కావడానికి కొడంగల్ ప్రజలు కృషి చేశారన్నారు.

మహాబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడైనా, సీఎంగా ఉన్న నాలుగేళ్ల కాలంలో కూడ  కేసీఆర్ ఏనాడు కొడంగల్ ప్రజల వైపు కన్నెత్తి కూడ చూడలేదన్నారు.రూ.200 కోట్లతో  కొడంగల్ ప్రజలను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కొడంగల్ ప్రజలపై కేసీఆర్ యుద్దాన్ని ప్రకటించారని ఆయన విమర్శలు గుప్పించారు. ముందస్తు ఎన్నికల్లో  గెలిచేందుకు ముందస్తు అరెస్ట్  చేస్తున్నారని.. ఈ ముందస్తు ఎన్నికల కారణంగా కేసీఆర్ ముందుగానే ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios