Asianet News TeluguAsianet News Telugu

ఇదిగో డాక్యుమెంట్: సీఎం అవుతారా అంటే రేవంత్ రిప్లయ్ ఇదీ

ఉపన్యాసాలు, పోరాటాలే కాదు పరిపాలన కూడ ఎలా చేయాలో తనకు తెలుసునని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు

revanth reddy releases policy document in hyderabad
Author
Hyderabad, First Published Nov 24, 2018, 1:12 PM IST


హైదరాబాద్: ఉపన్యాసాలు, పోరాటాలే కాదు పరిపాలన కూడ ఎలా చేయాలో తనకు తెలుసునని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఈమేరకు  పరిపాలనలో  తాము చేయదల్చుకొన్న అంశాలపై డాక్యుమెంట్‌ను  రేవంత్ రెడ్డి మీడియాకు విడుదల చేశారు.

శనివారం నాడు టీయూడబ్ల్యుజే  ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఎన్టీఆర్ షష్టిపూర్తి చేసుకొన్న తర్వాత టీడీపీని ఏర్పాటు చేసి 9 నెలల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. అంతేకాదు జనరంజకమైన పాలనను చేసి ప్రజల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయారని రేవంత్ గుర్తు చేశారు.

ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి సేవలు  అందించిన విషయాన్ని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు ఆదరించినప్పుడు పరిపాలనలో భాగస్వామ్యం చేసినప్పుడు తనకు  స్పష్టత ఉందన్నారు. ఈ మేరకు  తాను రూపొంచిందిన  డాక్యుమెంట్‌ను  మీడియా ప్రతినిధులకు  అందించారు.

తనకు పరిపాలన అనుభవం లేదంటూ కొందరు లేనిపోని అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. రైతు రుణ మాఫీ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే రైతులకు కలుగుతోందన్నారు.కానీ, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే  రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. పాలనలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.

రైతు పండించిన  పంటలను కార్పోరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని  రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఉత్పత్తులను సరుకులుగా మార్చి  సరసమైన ధరలకు వినియోగదారులకు రేషన్ షాపుల ద్వారా  అందిస్తామని రేవంత్  స్పష్టం చేశారు.  రేషన్ డీలర్ల వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు.

రైతుల ఉత్పత్తులను కొనుగోలు కోసం, విక్రయం కోసం  ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా చేస్తామన్నారు. 

యువత, నిరుద్యోగం సమస్యను  డిసెంబర్ 31వరకు తెప్పించుకొని జనవరి 1 నుండి  ఖాళీలను ప్రకటించి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్నారు. జూన్ రెండో తేదీన అందరికీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. డిసెంబర్ 31వరకు ఖాళీలను తెప్పించుకొని జూన్ రెండో తేదీనాటికి  భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ప్రతి మారుమూల గ్రామం నుండి  జిల్లా కేంద్రం వరకు మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. అంతేకాదు 50 మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రులతో పాటు నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి  తెలిపారు.  కేటగిరిల వారీగా ఈ ప్రాజెక్టులను  పూర్తి చేస్తామన్నారు. సాగు నీటి ప్రాజెక్టులతో  తాగు నీటిని అనుసంధానం చేస్తామన్నారు.

మహిళలపై  ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తే  తమ ప్రభుత్వం రెండు శాతం స్టాంప్ రిజిస్ట్రేషన్ చార్జీని వసూలు చేస్తామన్నారు. చట్టసభల్లో 25 శాతం మహిళలు ఉండేలా చట్ట సవరణ చేస్తామన్నారు.

ఆర్టీసీ, జర్నలిస్టులు, పోలీసులు ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారి పిల్లలకు స్కూళ్లను  ఏర్పాటు చేస్తామన్నారు.  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రె్డ్డి హామీ ఇచ్చారు. ఉచితంగా విద్యను అందిస్తామన్నారు.  ఈ విషయమై మేథావులతో చర్చించి  భవిష్యత్ కార్యాచరణ తీసుకొంటానని ఆయన చెప్పారు.

అయితే సీఎం అయితేనే  ఈ విషయాలన్నింటిని  అమలు చేసే అవకాశం ఉంటుందని  మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు సీఎం అనేది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటారని చెప్పారు.కానీ తమ ప్రభుత్వంలో  ఈ డాక్యుమెంట్లో పొందుపర్చిన అంశాలను  అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ విషయమై తాను పార్టీలో చర్చించినట్టుగా రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అందుకే కేటీఆర్‌ కొడుకునూ విమర్శించా: రేవంత్ రెడ్డి

కేటీఆర్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి: రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్....(వీడియో)

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 


 

Follow Us:
Download App:
  • android
  • ios