Asianet News TeluguAsianet News Telugu

ఆర్కేనగర్ లాగా కొడంగల్ ఎన్నిక వాయిదాకు కుట్రలు : రేవంత్

తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వం, ఎలక్షన్ కమీషన్  కలిసి కుట్రలు చేస్తున్నాయని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందరూ  కలిసి ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా ఉళ్లంగిస్తున్నారని మండిపడ్డారు. తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఆర్కే నగర్ ఎన్నికల్లో దినకరన్ డబ్బులు పంచుతున్నట్లు గుర్తించిన ఈసీ ఆ ఎన్నికలు వాయిదా వేశారని గుర్తు చేశారు. అదేవిధంగా కొడంగల్ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు.

revanth reddy controversy comments on kodangal elections
Author
Kodangal, First Published Nov 29, 2018, 6:01 PM IST

తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వం, ఎలక్షన్ కమీషన్  కలిసి కుట్రలు చేస్తున్నాయని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందరూ  కలిసి ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా ఉళ్లంగిస్తున్నారని మండిపడ్డారు. తమిళ నాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఆర్కే నగర్ ఎన్నికల్లో దినకరన్ డబ్బులు పంచుతున్నట్లు గుర్తించిన ఈసీ ఆ ఎన్నికలు వాయిదా వేశారని గుర్తు చేశారు. అదేవిధంగా కొడంగల్ ఎన్నికలను కూడా వాయిదా వేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు.

బుధవారం ఐటీ అధికారుల దాడుల్లో టీఆర్ఎస్  నేత వద్ద రూ.17.51  కోట్లు దొరికాయని రేవంత్ అన్నారు. అయితే అందుకు సంబంధించిన రహస్య నివేదికను మాత్రం అధికారులు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఐటీ అధికారులు, ఈసీపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులకు కూడా ముడుపులు అందినట్లు వివరాలునన్నాయని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఎన్నికలు సమీపించిన సమయంలో కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి బందువు పామ్ హౌస్ లో భారీ డబ్బులు పట్టుబడ్డాయి. జగన్నాథరెడ్డి అనే వ్యక్తి ఫామ్ హౌస్ పై బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.  స్థానిక పోలీసుల సాయంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టగా భారీగా దాచిన డబ్బుతో పాటు కొన్ని రశీదులు లభించినట్లు సమాచారం.  

ఈ ఐటీ దాడులపై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పందించారు. ఇప్పటికే తాము ఐటీ అధికారుల నుండి  ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నట్లు తెలిపారు. అయితే వారు వివరాలతో కూడిన సమాచారాన్ని ఓ సీల్డ్ కవర్ లో నివేదిక రూపంలో ఇచ్చారని దాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు. వాటిని పరిశీలించిన వెంటనే వివరాలను వెల్లడిస్తామని రజత్ కుమార్ తెలిపారు.  

మరిన్నివార్తలు

కొడంగల్ ఐటీ దాడులపై సీల్డ్ కవర్ నివేదిక...: రజత్ కుమార్

కొడంగల్ లో భారీ నగదు పట్టివేత...టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌస్‌లో...

Follow Us:
Download App:
  • android
  • ios