Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ మమ్మల్ని ఎంత తిట్టినా మేం ఆ పని చేసినం

  • టిఆర్ఎస్ లో చేరిన కొడంగల్ టిడిపి నేతలు
  • రేవంత్ ముఖ్య అనుచరుల చేరిక
  • రేవంత్ ను శిఖండితో పోల్చిన మంత్రులు
revanth followers joined in trs

కొడంగల్ నియోజకవర్గం నుండి వచ్చిన రేవంత్ రెడ్డి అనుచరులు, టిడిపి నేతలు, కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి, లక్ష్మారెడ్డి.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ ఆదర్శవంతమైన రాష్టం గా అవతరించిందన్నారు. 49 ఏళ్ళు ఆంధ్రవాళ్ళు పాలించారు. అంజయ్య, చెన్నారెడ్డి, పీవీ గారు మాత్రమే ఇక్కడివారు సిఎంలు అయ్యారని చెప్పారు. బువ్వ తినడం కూడా మేమె నేర్పింనం అని చెప్పి మనలను అప్పటి ఆంధ్ర నేతలు నమ్మించారని ఎద్దేవా చేశారు. మనకు పరిపాలన రాదన్నారు.

కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల వారు మనదగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకునే స్థాయికి ఎదిగామన్నారు మంత్రులు. మహబూబ్ నగర్ బాధలు గోరేటి వెంకన్న రాస్తే ఉద్యమంలో 10 ఏళ్ళు పాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ 3 ఏళ్లలో మేము మార్పు తీసుకువచ్చినం అన్నారు. గతంలో అధికారపార్టీ mla లకు మాత్రమే నిధులు ఇచ్చేవారని... కానీ కొడంగల్ నాయకుడు రేవంత్ రెడ్డి మమ్ముల్ని ఎంత తిట్టినా పట్టించుకోకుండా ప్రజలకోసం ఆ నియోజకవర్గానికి నిధులు  విడుదల చేసిన ప్రభుత్వం మాది అని వివరించారు.

గతం నుంచీ మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరిగినయి తప్ప పనులు కాలేదన్నారు. మా హయాంలో పనులు చేసి నీళ్లు అందిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాబోయే రోజుల్లో గొప్ప జిల్లాగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. తెలంగాణను ఆనాడు అడుగడుగునా అడ్డుకున్న పార్టీ తెలుగుదేశం.. ఈనాడు కూడా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందన్నారు. శ్రీశైలం నుండి, సాగర్ నుండి దొంగతనంగా నీళ్లు తీసుకెళ్తున్నారని విమర్శించారు.

ఆంధ్రా నేతల లాగా మాకు డబ్బులు సంపాదించుకొనే తెలివి రాలే, భూములు ఆక్రమించుకొనే తెలివి రాలే, రైతులను కాపాడుకొని తెలివి మాత్రమే వచ్చిందని వెల్లడించారు. కొడంగల్ నాయకుడు ఆనాడు శికండి పాత్ర పోషించిండు ఈనాడు అదే పాత్ర పోషిస్తున్నాడని రేవంత్ ను ఉద్దేశించి విమర్శించారు.

.

ఉపరాష్ట్రపతి వెంకయ్య కు అస్వస్థత... వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/hMBFkQ

Follow Us:
Download App:
  • android
  • ios