Asianet News TeluguAsianet News Telugu

కొత్త యాజమాన్యానికి రవి ప్రకాష్ బహిరంగ లేఖ

టీవీ9 సీఈఓ పదవి నుండి తనను తొలగించడంపై మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆ సంస్థ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు సమావేశమై కొత్త సీఈఓగా మహీంద్రా మిశ్రాను, సీఓఓగా సింగారావును నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

Ravi prakash reacts on new management decisions
Author
Hyderabad, First Published May 10, 2019, 9:55 PM IST

హైదరాబాద్: టీవీ9 సీఈఓ పదవి నుండి తనను తొలగించడంపై మాజీ సీఈఓ రవిప్రకాష్ ఆ సంస్థ యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు. ఏబీసీఎల్ బోర్డు శుక్రవారం నాడు సమావేశమై కొత్త సీఈఓగా మహీంద్రా మిశ్రాను, సీఓఓగా సింగారావును నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు బోర్డు డైరెక్టర్లు శుక్రవారం నాడు హైద్రాబాద్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించారు.

ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కొద్ది నిమిషాలకు ముందే రవి ప్రకాష్ టీవీ9 కొత్త యాజమాన్యానికి బహిరంగ లేఖ రాశారు.ఈ లేఖను యధాతథంగా ఇస్తున్నాం.

10 మే 2019
                                    సాయంత్రం 6 గంటలు


TO
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్,
అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఎబిసిఎల్),

97, రోడ్ నెం: 3, బంజారాహిల్స్,

హైదరాబాద్ 500034

విషయం : tv9 గ్రూప్ ఛానల్స్ సిఈఓ పదవి నుంచి రాజీనామా. తప్పుడు కేసులు బనాయించడం, యాజమాన్యాన్ని వేధించడంపై నిరసన.

    వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు

నేను.. రవిప్రకాష్.. tv9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. 
మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే tv9 పని పట్టాని ఈ చర్యలకు దిగారు. 
అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో tv9 సంస్థలోకి జొరబడ్డారు.
ఎన్ సిఎల్ టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు.
ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు.


రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో tv9 ని కంట్రోల్ లోకి తీసుకున్నారు.
తప్పుడు కంప్లయింట్స్ తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు.
పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు.


నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు.
మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్ గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. 
దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది. 

                                    - రవిప్రకాష్


ఒకవైపు కొత్త యాజమాన్యం మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే మీడియా ప్రతినిధులకు రవి ప్రకాష్ రాసిన లేఖ అందింది. ఈ లేఖపై కొత్త యాజమాన్యం  ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అసలు జరిగిందిదీ, అందుకే రవిప్రకాశ్‌ను తప్పించాం: టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్

రవిప్రకాష్ ఔట్: టీవీ9 సీఈఓగా మహేంద్ర మిశ్రా

టీవీ9 వివాదం: రవి ప్రకాష్ స్థానంలో కొత్త సీఈఓను ప్రకటించే ఛాన్స్

టీవీ9 వివాదం: పోలీసుల విచారణకు హాజరైన ఫైనాన్స్ డైరెక్టర్

రెండో రోజూ టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios