Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే కెసిఆర్ కు కుంతియా సవాల్

కెసిఆర్ కు సవాల్ విసిరిన కుంతియా

వచ్చీ రాగానే కెసిఆర్ ను టార్గెట్ చేసిండు

టిడిపి, వైసిపి తెలంగాణలో లేనే లేవు

బిజెపి ప్రత్యామ్నాయం కాదు

Ramachandra khuntia open challenge to kcr

తెలంగాణలో ఫుల్ ఇన్ ఛార్జిగా కాలు పెట్టగానే రామచంద్ర కుంతియా అప్పుడే తెలంగాణ సిఎం కెసిఆర్ కు గట్టి సవాల్ విసిరిండు. టిఆర్ఎస్ పార్టీకి ఒక సిద్ధాంతం అంటూ లేదని విమర్శించిండు కుంతియా.

కేసీఆర్ కు నిజంగా ప్రజల పై విశ్వాసం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ నాయకత్వంలోనే రానున్న ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు.

వైఎస్, కిరణ్ లాంటి వారి వల్ల కాంగ్రెస్ తెలంగాణకు సుముఖంగా లేదన్న భావన క్షేత్రస్థాయిలో ఏర్పడిందని వెల్లడించారు. ఆ భావన ప్రజల్లో నెలకొనడంతోనే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరిందన్నారు. సోనియా ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా అడ్డంకులెన్ని వచ్చినా అధిగమించి తెలంగాణ ఇచ్చారని వివరించారు. తెలంగాణ కేసీఆర్ వల్లే ఏర్పడి ఉంటే ఆయన సోనియాను ఎందుకు కలిశారో చెప్పాలని నిలదీశారు.

సీఎం అభ్యర్థిని ముందే నిర్ణయించే సాంప్రదాయం కాంగ్రెస్ లో లేదన్నారు కుంతియా. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీకే ఆ సామర్థ్యం ఉందన్నారు. టీడీపీ, వైసీపీలు తెలంగాణలో లేవని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios