Asianet News TeluguAsianet News Telugu

పోలింగ్ సిబ్బంది నిర్వాకం: లంచ్ టైం అంటూ పోలింగ్ కేంద్రానికి తాళం

 పోలింగ్ శాతాన్ని పెంచాలి, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తూ అందర్నీ చైతన్య వంతపరుస్తున్నారు. పోలింగ్ ను సజావుగా సాగేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. అయితే ఎన్నికల కమిషన్ ఆలోచనలకు తూట్లు పొడిచేలా వ్యవహరించింది ఎన్నికల సిబ్బంది. 
 

polling officers are closed to polling center due to lunch time
Author
Nalgonda, First Published Dec 7, 2018, 2:12 PM IST

తుంగతుర్తి: పోలింగ్ శాతాన్ని పెంచాలి, ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తూ అందర్నీ చైతన్య వంతపరుస్తున్నారు. పోలింగ్ ను సజావుగా సాగేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు. అయితే ఎన్నికల కమిషన్ ఆలోచనలకు తూట్లు పొడిచేలా వ్యవహరించింది ఎన్నికల సిబ్బంది. 

ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం యావత్ తెలంగాణ ఎన్నికల కమిషన్ కే మచ్చతెచ్చేలా ప్రవర్తించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా తిరుమగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి 291 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. 

ఓటు వేసేందుకు ఓటర్లు వచ్చినా కూడా లంచ్ టైమ్ అంటూ పోలింగ్ స్టేషన్ కే సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. అయితే భోజన సమమంలో ఓటు వేసేందుకు వచచిన ఓటర్లు బూత్ కు తాళం వేసి ఉండటంతో ఖంగుతిన్నారు. వెంటనే ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.   

దీంతో పక్కనే ఉన్న పోలింగ్ స్టేషన్ సిబ్బంది సోషల్ మీడియాలో ఫోటో చూసి 291 బూత్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే ఉద్యోగులు వచ్చి పోలింగ్ బూత్ ను తెరిపించారు.  

వాస్తవానికి ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్ ను మూసివెయ్యకూడదు. ఒకరు తర్వాత ఒకరు వెళ్లాల్సి ఉంది. అంతేకానీ పోలింగ్ స్టేషన్ ను మూసి వెయ్యడం కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు. అయితే పోలింగ్ సిబ్బంది వ్యవహారంపై ఎన్నికల కమిషన్ విధులను నిర్లక్ష్యం చేసినట్లు పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios