Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మంలో పొలిటికల్ హీట్: చంద్రబాబు టూర్ పై టీఆర్ఎస్,టీడీపీల మాటల యుద్ధం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరుకుంది. బుధవారం ఖమ్మంలో ప్రజాఫ్రంట్ నిర్వహించబోతున్న బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చంద్రబాబుతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

political heat in khammam district
Author
Khammam, First Published Nov 27, 2018, 10:17 PM IST

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరుకుంది. బుధవారం ఖమ్మంలో ప్రజాఫ్రంట్ నిర్వహించబోతున్న బహిరంగ సభకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చంద్రబాబుతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం బహిరంగ సభలో పాల్గొననున్నారు. 

రాజకీయాల్లో భిన్న ధృవాల అధ్యక్షులిద్దరూ రాష్ట్ర రాజకీయాల గురించి ఏ మాట్లాడతారా అంటూ సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చంద్రబాబు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ప్రచారానికి రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరవావు హెచ్చరించారు. 

తెలంగాణపై చంద్రబాబు ఇన్నాళ్లు కుట్రపన్నారని, పోలవరానికి సంబంధం లేని గ్రామాలను కూడా చంద్రబాబు లాక్కున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టుపై బాబు రాసిన లేఖలకు రాహుల్ దగ్గర సమాధానం ఉందా అని తుమ్మల నిలదీశారు. 

తెలంగాణలో జరుగుతున్న ప్రతి ప్రాజెక్ట్‌పై కూడా చంద్రబాబు కొర్రీలు పెడుతున్నారని తుమ్మల విమర్శించారు. తెలుగుదేశానికి శత్రువైన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టారని, రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని తుమ్మల ఆరోపించారు.

అధికారం కోసం విపక్షాలు అర్రులు చాస్తున్నాయని తెలంగాణలో ప్రచారానికి వస్తున్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేకనే ప్రజాఫ్రంట్ గా కూటమి కట్టారని విమర్శించారు. 

భద్రాచలం గుడిని, జనాలను అష్టకష్టాలపాలు చేసిన పార్టీ టీడీపీ అని తుమ్మల దుయ్యబట్టారు. విభజన చట్టంలో లేకపోయినా ఏడు మండలాలను లాగేసుకున్నారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని చీకటి రోజుగా ప్రకటించిన చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణపై దండయాత్రకు వస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మరోవైపు తుమ్మల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభపై టీఆర్ఎస్ లో అప్పుడు భయం మెుదలైందన్నారు. అందువల్లే మంత్రులు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులకు అడ్డుపడితే అనుమతులు ఎలా వచ్చాయని నిలదీశారు. అంటే టీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెప్తున్నారా లేక ప్రభుత్వం అసత్యాలు చెప్తుందా అంటూ నిలదీశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రతీ రాష్ట్రం డీపీఆర్ లు అడుగుతోంది. 

ప్రజాఫ్రంట్ ఏర్పడగానే టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందని నామా అన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందన్న విషయం తెలియదా అని నిలదీశారు. అసలు తుమ్మల మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు. 

Follow Us:
Download App:
  • android
  • ios