Asianet News TeluguAsianet News Telugu

రీ కౌంటింగ్ కోరుతూ కాంగ్రెస్ నేత పద్మావతి హైకోర్టులో పిటిషన్

 తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  అక్రమాలు జరిగాయంటూ  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ కౌంటింగ్ చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

padmavati files petition in high court for re counting in kodada segment
Author
Hyderabad, First Published Jan 29, 2019, 1:00 PM IST

హైదరాబాద్: తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో  అక్రమాలు జరిగాయంటూ  కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ కౌంటింగ్ చేయాలని ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కోదాడ అసెంబ్లీ స్థానం నుండి  పద్మావతి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఆమె విజయం సాధించారు. కానీ, ఈ ఎన్నికల్లో  పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ విజయం సాధించారు.

ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని పద్మావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ కౌంటింగ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పద్మావతి పోటీ చేసిన కోదాడ స్థానంలో మూడు ఈవీఎంలు కౌంటింగ్ సమయంలో పనిచేయలేదు.

వీవీప్యాట్‌లను లెక్కించాలని  కౌంటింగ్ సందర్భంగా పద్మావతి డిమాండ్ చేశారు. మరోసారి రీ కౌంటింగ్ జరిపించాలని ఆమె హైకోర్టును  ఆశ్రయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios