Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ సీన్ రిపీట్: హుజూర్ నగర్ ఉపఎన్నికకు భారీ నామినేషన్లు

నిజామాబాద్ లోక్ సభ సీన్ సైతం రిపీట్ అయ్యింది. నిజామాబాద్ లో పసుపు రైతులు నామినేషన్లు వేయగా హుజూర్ నగర్ లో గిరిజనులు నామినేషన్ దాఖలు చేశారు. తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని మట్టంపల్లి మండలం గుర్రంపోడుకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.

Nominations to  End in Huzur nagar constituency by poll elctions
Author
Huzur Nagar, First Published Sep 30, 2019, 4:52 PM IST

సూర్యాపేట: అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది. సోమవారం గడువు ముగిసే సరికి 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్ లు దాఖలు చేశారు. 

 అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి శానంపూడి సైదిరెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి నామినేషన్లు దాఖలు చేశారు.  

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖరరావు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు పలువురు స్వతంత్రులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. 

మరోవైపు తన 100 ఎకరాల భూమికి అధికారులు పట్టా పుస్తకం ఇవ్వలేదని నిరసిస్తూ హుజూర్‌నగర్‌ కు చెందిన లక్ష్మీ నరసమ్మ అనే 85ఏళ్ల వృద్ధురాలు సైతం నామినేషన్ దాఖలు చేసింది. తన భూమికి పట్టాలు ఇవ్వాల్సిందిగా అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కరుణించకపోవడంతో నిరసనగా నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. 

అటు నిజామాబాద్ లోక్ సభ సీన్ సైతం రిపీట్ అయ్యింది. నిజామాబాద్ లో పసుపు రైతులు నామినేషన్లు వేయగా హుజూర్ నగర్ లో గిరిజనులు నామినేషన్ దాఖలు చేశారు. తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని మట్టంపల్లి మండలం గుర్రంపోడుకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. సుమారు 50 మందికి పైగా గిరిజనులు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.

ఇకపోతే మంగళవారం నామినేషన్‌ల పరిశీలన జరుగనుంది. నామినేషన్‌ల ఉపసంహకరణకు అక్టోబరు 3వరకు గడువు ఉంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగ్గా 24న కౌంటింగ్, అదేరోజు ఫలితం వెలువడనుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : నామినేషన్ వేసిన చావా కిరణ్మయి

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఐ మద్దతు కోరిన కాంగ్రెస్

ఉత్తమ్ పద్మావతి అనివార్యత: రేవంత్ రెడ్డికి అధిష్టానం క్లాస్...

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: నానినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు......
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు : గెలుపుకోసం ఆశీర్వాదం (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios