Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొత్త మద్యం విధానం.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో నూతన నిర్ణయం తీసుకుంది. సరికొత్త పాలసీని తీసుకువచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేయడం గమనార్హం.

new liquor policy in telangana 2019, notification released
Author
Hyderabad, First Published Oct 3, 2019, 2:00 PM IST

తెలంగాణలో కొత్త మద్యం విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా మార్చింది. 5వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేయనున్నారు.

5 వేల నుంచి 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా ప్రాంతాల్లో రూ.60లక్షలు, లక్ష జనాభా నుంచి 5లక్షలలోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85లక్షలు, 20లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజును ఖరారు చేశారు.

మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ.2లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 2,216 దుకాణాలకు లాటరీ పద్ధతి ద్వారా దుకాణణదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అంతేకాకుండా మద్యం షాపులను తెరచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ఇతర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నంుచి రాత్రి 10గంటల వరకు అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios