Asianet News TeluguAsianet News Telugu

కేంద్రంపై పోరాడతాం.. ఎంపీ కవిత

ప్రధాని నరేంద్రమోదీని  కలిసి పెండింగ్ హమీలు నేరవేర్చాలని కొరుతామని ఆమె చెప్పారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం,డిఫెన్స్ స్దలం కోసం కేంద్రం తో పోరాడుతామన్నారు. 

mp kavitha says we will fight with central govt for telangana rights
Author
Hyderabad, First Published Jan 30, 2019, 2:14 PM IST

విభజన హామీల అమలు కోసం కేంద్రంతో పోరాడతామని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. బుధవారం పంచాయితీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా.. ఆమె నవీపేట్ మండలం పొతంగల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు.

ప్రధాని నరేంద్రమోదీని  కలిసి పెండింగ్ హమీలు నేరవేర్చాలని కొరుతామని ఆమె చెప్పారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం,డిఫెన్స్ స్దలం కోసం కేంద్రం తో పోరాడుతామన్నారు. హైకోర్టు తీర్పుతో సమస్య తొలగిందని..ఇవ్వాల్సింది ఇక కేంద్రమేనని ఆమె అన్నారు.  తెలంగాణ హక్కుల సాధనకు పోరాటాలు చేస్తామని.. చర్చలు, చట్టబద్ధ వ్యవస్థల ద్వారా రాష్ట్రానికి రావాల్సినదానిని సాధించుకుంటామన్నారు.

కేసీఆర్ పాలనకు రెఫరెండం గా మళ్లీ ప్రజలు అధికారం అప్పగించారన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ మోసాలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. టామ్ కాం మూడున్నర ఏళ్లుగా ఆ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. 

నకిలి ఏజెంట్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను స్వయంగా కొరతానన్నారు. కేంద్రం నకీలి ఏజెంట్ల పై ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios